Huppa Huiya: ఈ పాట సినిమాలో పెట్టుంటే ఇంకా ప్లస్ అయ్యేది?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జూన్ 16న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేక ప్లాప్ గా మిగిలింది. ఒక గొప్ప కథ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ లో మాత్రం దారుణమైన ట్రోల్స్ కి గురి కావడానికి కారణం అయ్యింది. ఈ సినిమాలో రామాయణాన్ని వక్రీకరించారని, హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ని సరిగా చూపించలేదని, రావణుడి గెటప్ కూడా బాగాలేదని ఇలా రకరకాల ట్రోల్ల్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా సినిమాలో డైలాగ్స్ మీద ఈ సినిమా రైటర్ ని ప్రేక్షకులు దారుణంగా తిట్టి పోశారు.

అయితే ఆదిపురుష్ ని ఆడించడం కోసం ఇప్పటికి చిత్ర యూనిట్ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొన్ని రోజుల కిందినుండే టికెట్ రేట్లు భారీగా తగ్గించగా, తాజాగా ఈ సినిమా యొక్క వీడియో సాంగ్స్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ పాజిటివ్ వైబ్ లను క్రియేట్ చేస్తున్నారు. ఈ పాటల్లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన “హుప్పా హుయ్య” అనే పాట ఆడియన్స్ ని బాగా ఆకర్షిస్తుంది. సినిమాలో వారధి కట్టే సమయంలో వచ్చే ఈ పాట వానర సైన్యం లో ఉత్తేజాన్ని నింపే విధంగా ఉంటుంది. ఈ పాట విన్న ఆడియన్స్ ఇంత మంచి సాంగ్ ని సినిమాలో ఎందుకు పెట్టలేదని చిత్ర యూనిట్ ని విమర్శిస్తున్నారు.

వినడానికి ఎంతో బాగున్న ఈ పాట నిజంగా ఆదిపురుష్ లో పెట్టుంటే ఆ సినిమాకు చాలా ప్లస్ అయ్యేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదీ గాక ఆదిపురుష్ సినిమాలో ఉన్న ఫైట్ సీన్లను ట్రిమ్ చేసి ఈ పాటను యాడ్ చేసి ఉంటే చాలా బాగుండేదని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇప్పుడు సినిమాలో యాడ్ చేసిన ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి చూడడానికి మొగ్గు చూపడం లేదు. కనీసం ఓటిటి లో రిలీజ్ చేసేటప్పుడైనా ఆదిపురుష్ లో హుప్పా హుయ్య పాటని యాడ్ చేస్తారేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు