Jai Hanuman: జై హనుమాన్ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..!

Jai Hanuman

ప్రశాంత్ వర్మ.. హనుమాన్ చిత్రం తెరపైకి వచ్చే వరకు కూడా ఈయన గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి.. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని రూ.250 కోట్ల మార్క్ దాటేసి సంచలనం సృష్టించింది. యంగ్ హీరో తేజ ప్రధాన పాత్రలో అమృత అయ్యర్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం.. వీరికి మాత్రమే కాదు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి కూడా మంచి పేరు తెచ్చింది. దీంతో పలువురు స్టార్ హీరోలు కూడా ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో సినిమాకి సిద్ధమయ్యారు ప్రశాంత్ వర్మ.. త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టు జై హనుమాన్ మొదలుకానున్నట్లు వెల్లడించారు.

అయితే ఇందులో హనుమంతుడు, రాముడు పాత్రలకు ఎవరిని తీసుకోబోతున్నారు అనే ఆసక్తి అభిమానులలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ.. తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దీంతో ఆ స్టార్ హీరోల అభిమానుల ఆనందానికి అవధులు లేదని చెప్పవచ్చు.. ఇకపోతే ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..” జై హనుమాన్ సినిమా స్కేల్ చాలా పెద్దది.. ఇందులో పెద్ద స్టార్స్ నటించే అవకాశం ఉంది.. ముఖ్యంగా హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ఆ పాత్ర మనం బయట చూసే హనుమాన్ లా ఉండదు. ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు.. ఇక హనుమాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటులు రెడీగా ఉన్నారు.. ముఖ్యంగా ఆ పాత్ర చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి.. ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండొచ్చు..

అయితే మెగాస్టార్ కి పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత నేను కలవలేదు.. అన్నీ కుదిరితే చిరంజీవి ఆ పాత్ర చేసే అవకాశం ఉంది… అయితే ఈ విషయంలో ఏం జరగబోతుందో ఇప్పుడే చెప్పలేము.. ఇక రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేష్ బాబు.. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో రాముడిగా క్రియేట్ చేసిన మహేష్ బాబు ఫోటోలను చూశాను.. ఇక మా ఆఫీసులో కూడా ఆయన ముఖంతో రీ క్రియేట్ చేసి చూసాము.. బాగా సెట్ అయ్యారు” అంటూ తెలిపారు ప్రశాంత్ వర్మ.. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ తన సినిమాకి వీరిద్దరిని తీసుకుంటారేమో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అలాగే జై హనుమాన్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా పనులు ఏడాది కిందటే మొదలయ్యాయి. అయితే ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా పనులు జరుగుతున్నాయి.. వీ ఎఫ్ ఎక్స్ తో పాటు మిగిలిన వాటిపై ఒక క్లారిటీ రాగానే సినిమా షూటింగ్ మొదలు పెడతాము.. ముఖ్యంగా సినిమా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని.. ఆలస్యమైనా సరే అద్భుతంగా తెరకెక్కిస్తాను అంటూ మాట ఇస్తున్నారు ప్రశాంత్ వర్మ.. మరి జై హనుమాన్ తో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు