Kriti Karbandha: పెళ్లి పీటలెక్కనున్న చెర్రీ సిస్టర్.. వరుడతడే..!

Kriti Karbandha

రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీ సినిమాలో రామ్ చరణ్ కి అక్కగా నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కృతి కర్బంద తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా అడుగు పెట్టింది. ముఖ్యంగా మెగా హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె గత నాలుగేళ్లుగా ఒక నటుడితో డేటింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లి గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వచ్చాయి.. కానీ ఇప్పుడు వాటిని వీరు నిజం చేశారు. కాకపోతే చాలా రహస్యంగా నిశ్చితార్థం చేసుకోగా.. ఫోటోలు కాస్త వైరల్ గా మారడంతో ఎవరిని వివాహం చేసుకోబోతోంది? ఎప్పుడు వివాహం చేసుకోబోతోంది? అంటూ వార్తలు వినిపించాయి.

ఇకపోతే ఢిల్లీలో పుట్టి పెరిగిన కృతికర్బంధ బోణీ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా కెరియర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత తీన్మార్, అలా మొదలైంది ,ఒంగోలు గిత్త, మిస్టర్ నూకయ్య, ఓం త్రీడి వంటి తదితర చిత్రాలు చేసిన ఈమె చివరిగా 2015 లో వచ్చిన బ్రూస్లీ సినిమాలో రామ్ చరణ్ కి అక్కగా నటించింది. గ్లామర్ పరంగా హీరోయిన్ రేంజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి.. దీంతో బాలీవుడ్ పై పూర్తి ఫోకస్ పెట్టేసింది. అక్కడే పలు సినిమాలు చేస్తూ కాస్త బిజీగా మారింది. ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో రిలేషన్ లో ఉన్నట్లు గత నాలుగేళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డేటింగ్ నిజమే అని క్లారిటీ ఇచ్చేలా చాలా చోట్ల వీళ్ళిద్దరూ కలిసి కనిపించారు కూడా.. మరి పెళ్లెప్పుడు అని అందరూ అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఆ పుకార్లకు శుభం కార్డు పలుకుతూ నిశ్చితార్థం చేసుకున్నారు.

అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య కృతికర్బంధ – పులకిత్ సామ్రాట్ నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవడంతో వీరికి నిశ్చితార్థం జరిగిన విషయం తెరపైకి వచ్చింది. ఇక అలాగే వీరి పెళ్లి వచ్చే నెలలో ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే వీరు.. ఎప్పుడు వివాహం చేసుకుంటారు అనే విషయంపై అధికారికంగా ప్రకటన ఇస్తారేమో చూడాలి. మొత్తానికైతే బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకోవడానికి సిద్ధమయింది కృతి కర్బంద

- Advertisement -

Tollywood heroine Kritikarbandha - Pulakit Samrat got engaged

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు