Anushka Shetty: ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్.. స్టార్ క్రికెటర్ తో స్వీటీ పెళ్లి..!

Anushka Shetty

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ పేరు చెప్పగానే వెంటనే వినిపించే పేరు అనుష్క శెట్టి.. అలాగే అనుష్క పేరు చెప్పినా ప్రభాస్ పేరే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.. అంతలా వీరిద్దరూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటారు.. నిజానికి వీరిద్దరూ మంచి స్నేహితులే అయినా చాలామంది వీరిద్దరూ వివాహం చేసుకుంటే చూడాలని కోరుకునే వారిలో అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి పలు చిత్రాలలో నటిస్తున్నప్పుడే ప్రేమలో పడ్డారని వివాహం కూడా చేసుకోబోతున్నారు అంటూ పలు రకాల వార్తలు వినిపించాయి కానీ ఇప్పటికే వీరిద్దరూ పెళ్లీడు వయసు దాటిపోయినా సింగిల్ గానే ఉన్నారు.. కానీ వివాహం మాత్రం చేసుకోలేదు.

మరొకవైపు ప్రభాస్ ఇతర హీరోయిన్లతో రిలేషన్లో ఉన్నట్టు వార్తలు రాగా .. అనుష్క శెట్టి మాత్రం వేరొకరి వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు కూడా మరొకసారి ఇలాంటి వార్తలే తెరపైకి రావడంతో ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు..ఇక అసలు విషయంలోకెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి యోగా టీచర్ గా పని చేస్తున్న ఈమె నాగార్జున నటించిన సూపర్ చిత్రంతో హీరోయిన్గా అడుగుపెట్టింది.. సినిమా డిజాస్టర్ అయినా ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు.

ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించిన ఈమె బాహుబలి సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది.అయితే ఈ సినిమా తర్వాత అవకాశాలు భారీగా వస్తాయని అనుకున్నారు కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. అలా భాగమతి, నిశ్శబ్దం వంటి లేడీ చిత్రాలలో నటించినా పెద్దగా సక్సెస్ రాలేదు. దాంతో ఇండస్ట్రీకి దూరమైంది.. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గత ఏడాది మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించి మళ్లీ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది.. ఈ సినిమాతో మళ్లీ తన నటనలోని మార్క్ ను కనబరిచింది అనుష్క.

- Advertisement -

ప్రస్తుతం అనుష్క చేతిలో ఒక్క సినిమా కూడా లేదు .. దీంతో పెళ్లి వార్తలకు జోరు అందుకున్నాయి. తాజాగా ఈమె ఓ స్టార్ క్రికెటర్ తో వివాహానికి సిద్ధమయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ క్రికెటర్ తో వివాహానికి స్వీటీ కూడా ఒప్పుకుందని.. ఇరు కుటుంబ సభ్యులు వీరి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అనుష్కకు సంబంధించిన ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు