Madhumani: అప్పుడేమో నాగ్ పక్కన.. ఇప్పుడేమో నాగ్ తల్లిగా..!

Madhumani

సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లు అలాగే లేడీ ఆర్టిస్టులు ఒకప్పుడు హీరోకి ఫ్రెండ్ గా , విలన్ గా, జోడిగా నటించి ఆ తర్వాత అదే హీరోలకు తల్లి పాత్రలు చేస్తూ అలరిస్తూ ఉంటారు.. హీరోలు తమ ఏజ్ ను తగ్గించుకొని హీరోగా సినిమాలు చేస్తూ ఉంటే… ఈ ఆర్టిస్టులు అలాగే హీరోయిన్లు మాత్రం వాళ్ళ పక్కనే సీనియర్ నటులుగా నటిస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

 అలా చాలామంది స్టార్ ఆర్టిస్టులు.. ఒకప్పుడు హీరో ఏజ్ కి తగ్గ పాత్రలు చేసి అలరిస్తే.. ఇప్పుడు అదే హీరోల పక్కన సీనియర్ నటులుగా చేస్తూ అలరిస్తున్నారు. ఇక అదే కోవలోకి సీనియర్ నటి మధుమణి కూడా చేరిపోయారు..

తెలుగులో ఒకప్పటి సూపర్ హిట్ సీరియల్ ఋతురాగాలు తో కెరీర్ మొదలుపెట్టిన ఈమె వరుసగా సీరియల్స్ చేస్తూ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో హీరోయిన్స్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేసిన ఈమె ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్ గా ఇలా పలు రకాల క్యారెక్టర్ లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.ఇటీవలే  నాగార్జున నటించిన నా సామిరంగా సినిమాలో నాజర్ సరసన నటించింది. ఒక రకంగా చెప్పాలంటే నాగార్జునకి అమ్మలాంటి పాత్ర చేసింది ఈ ముద్దుగుమ్మ..ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా కింగ్ నాగార్జున తెరకెక్కించిన చిత్రం నాసామిరంగ..

ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మధుమణి సినిమా గురించి మాట్లాడి ఆ తర్వాత నాగార్జునతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించింది.. నాగార్జునతో కలిసి సంతోషం సినిమాలో ఫ్యామిలీ మెంబర్ గా నటించాను. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నాగ్ తో అమ్మలాంటి పాత్రలో నటించాను. ఇన్నేళ్ల తర్వాత కూడా నాగార్జున సినిమాలో నటించడం నాకు సంతోషంగా ఉంది అంటూ తెలిపింది మధుమణి. ఇకపోతే సంతోషం సినిమా 2002లో వచ్చింది.. ఆ సినిమాలో మధుమణి హీరోయిన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల్లో మాలిక అనే పాత్ర పోషించింది..

- Advertisement -

https://www.instagram.com/p/C1wgvR8RYsL/?utm_source=ig_web_copy_link

అప్పుడు నాగార్జున ఏజ్ కి తగ్గట్టుగా నటించిన ఈమె అప్పట్లో నాగార్జునతో దిగిన ఫోటోలను గతంలో సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. ఇక మళ్లీ 21 సంవత్సరాల తర్వాత నాగార్జునతో నా సామిరంగా సినిమాలో అమ్మలాంటి పాత్రలో నటించడం గమనార్హం..మరోవైపు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నాగార్జున మాత్రం ఇంకా హీరోగానే చేస్తుంటే.. ఇలాంటి ఆర్టిస్టులు మాత్రం వారికి తల్లిగా నటిస్తూ వైరల్ గా మారుతున్నారు.  ఇక ఇన్నేళ్ళ తర్వాత మధుమణి ఈ విషయాన్ని గుర్తు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు