Prabhas : 50 కోట్లతో అయోధ్యలో అన్నదానం… ప్రభాస్ నిజంగానే “రాజు”

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయోధ్యలో అన్నదానం కోసం 50 కోట్లు ఖర్చు పెట్టడానికి ముందడుగు వేశారు అనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయనతో కలిసి పని చేసిన నటీనటులు ప్రభాస్ మంచి మనసు గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు జనాల ఆకలి తీర్చడానికి ప్రభాస్ చేస్తున్న ఈ మంచి పనితో ఆయన రియల్ హీరో అంటూ డార్లింగ్ ను కొనియాడుతున్నారు.

భారత ప్రధాని మోడీ నేతృత్వంలో జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు వంటి నటులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ వేసిన ముందడుగు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరో మూడు రోజుల్లో జరగబోతున్న ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసే బాధ్యతను ప్రభాస్ తీసుకున్నారు. అయోధ్య రామ మందిరం చుట్టుపక్కల 300 చోట్ల అన్నదానం చేయబోతున్నారట. దానికి అయ్యే ఖర్చు 50 కోట్లు కాగా, ఆ మొత్తాన్ని భరించే బాధ్యతను ప్రభాస్ స్వీకరించాలని సమాచారం.

ఇప్పటికే ప్రభాస్ తను హీరోగా నటించే సినిమా సెట్స్ లలో కూడా విందు భోజనంతో నటీనటులకు ట్రీట్ ఇస్తారన్న విషయం తెలిసిందే. తనతో పాటు పనిచేసే వారు కూడా మంచి భోజనం చేయాలనేది డార్లింగ్ ఆలోచన. ఇక ప్రభాస్ కు కూడా మంచి తెలుగింటి విందు భోజనం లేనిదే కడుపు నిండదట. ప్రస్తుతం అయోధ్యలో అన్నదానం కోసం 50 కోట్లు, సినిమా లొకేషన్లలో ఆయన పెట్టించే విందు భోజనం, ప్రభాస్ మంచి మనసు, భోళా గుణం గురించి ఇండస్ట్రీలోని వారందరూ చెప్పుకోవడం వంటివి చూశాక ప్రభాస్ రాజు నిజంగానే రాజు అంటూ మెచ్చుకుంటున్నారు. ఇక 50 కోట్లు అంటే ప్రభాస్ ఒక సినిమాకు తీసుకునే పారితోషకంలో సగభాగం. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన శ్రీరాముని భక్తుల కోసం ఖర్చు చేయడం ప్రశంసనీయం.

- Advertisement -

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే… రీసెంట్ గా ఆయన “సలార్” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “రాజా సాబ్”, నాగ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ “కల్కి” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. “కల్కి” మూవీ మే 9న రిలీజ్ కానుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు