Guntur Kaaram : “కుర్చీ మడత పెట్టి” సాంగ్ ను చేజార్చుకున్న స్టార్ హీరోయిన్… పూర్ణ కంటే ముందు ఆమెకే ఆఫర్?

“గుంటూరు కారం” సినిమా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా “రమణ ఎయ్” అనే పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. “గుంటూరు కారం” సినిమాలో చెప్పుకోదగ్గ సాంగ్స్ లో “రమణ” సాంగ్ ఒకటి కాగా, “కుర్చీ మడత పెట్టి” సాంగ్ మరొకటి. ఈ సాంగ్ మహేష్ అభిమానులకు మంచి ఊపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మాస్ సాంగ్ లో డాన్స్ తో అదరగొట్టే ఛాన్స్ వచ్చినప్పటికీ ఓ స్టార్ హీరోయిన్ చేజార్చుకుందట.

జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయిన మాస్ అండ్ యాక్షన్ మూవీ “గుంటూరు కారం”. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడవ సినిమా కావడంతో భారీ అంచనాలతో ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ విడుదలైన తర్వాత అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. “గుంటూరు కారం” సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా, ఫ్రెండ్స్ నుంచి మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

మదర్ సెంటిమెంట్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా శ్రీలీల కనిపించింది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించగా, మరో హీరోయిన్ పూర్ణ “కుర్చీ మడత పెట్టి” పాటలో మెరిసింది. ఈ సాంగ్ ఎంత వివాదాస్పదమైందో అంతే పాపులర్ అయ్యింది. ఎవరో ఒక ముసలాయన చెప్పిన బూతు డైలాగులు పాటలో మహేష్ బాబు ద్వారా చెప్పించడం అనే విషయం చాలామందికి నచ్చలేదు. కానీ మహేష్ అభిమానులు మాత్రం ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక థియేటర్లలో “కుర్చీ మడత పెట్టి” పాటలో మహేష్ బాబు, పూర్ణ, శ్రీలీల కలిసి డ్యాన్స్ ఇరగదీశారు. అయితే ముందుగా ఈ పాటలో మరో హీరోయిన్ ను అనుకున్నారట దర్శకుడు త్రివిక్రమ్. పూర్ణ బదులు చందమామ కాజల్ అగర్వాల్ తో స్టెప్పులు వేయించాలని భావించారట. కానీ కాజల్ ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం పూర్ణకు దక్కిందని సమాచారం. ఇప్పటికే మహేష్ బాబుతో హీరోయిన్ గా చేసిన కాజల్ ఇప్పుడు ఆయన పక్కన ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోలేదట. ఇక ఈ రూమర్లను పక్కన పెట్టేస్తే థియేటర్లలో మాత్రం ఈ పాట వచ్చినప్పుడు ఈలలతో టాప్ లేచిపోతోంది. కాగా “గుంటూరు కారం” మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ కాలేదు. కలెక్షన్స్ పరంగా 72% మాత్రమే రికవరీ చేసింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు