Sree Leela : స్పెషల్ సాంగ్ కు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన డ్యాన్స్, నటనతో ఎంతోమంది అభిమానులను తనవైపుకు తిప్పుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరింత మాస్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక పుష్ప-1లో అల్లు అర్జున్ కి స్నేహితుడిగా కేశవ పాత్రలో జగదీష్ అద్భుతంగా నటించాడు. ఇక పుష్ప-2లో కూడా కేశవ ఉండబోతున్నాడు. ప్రస్తుతం ఇతను అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఇతనితో చిత్రీకరించాల్సిన సీన్లు చాలానే ఉన్నాయట. అందుకోసం ఇతడిని బెయిల్ మీద తీసుకువచ్చి షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్నారట.

ఇందులో కొన్ని సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నారట. ఇదిలా ఉంటే….పుష్ప-2 సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఎవరిని పెడతారనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటివరకు సమంత, దిశా పటాని, కృతి సనన్ పేర్లు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం….. శ్రీలీలను ఐటమ్ సాంగ్ లో పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్ట్-1లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు పార్ట్-2లో శ్రీలీలను పెడితే అంతకుమించి బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్.

- Advertisement -

ఇప్పటికే ఈ సాంగ్ కు సంబంధించి దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మాస్ ట్యూన్ రెడీ చేశారట. ఇక ఇలాంటి మాస్ సాంగ్ లో శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని అంతా భావిస్తున్నారట. శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాను నటించిన ప్రతి సినిమాలో తన నటన కన్నా డాన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకోసమే పుష్ప-2 సినిమాలో శ్రీలీలతో ఐటమ్ సాంగ్ ని చేయించాలనే ప్లాన్ లో ఉన్నారట. మరి ఇది కేవలం రూమర్ ఏనా, లేకపోతే నిజంగా శ్రీలీల ఐటమ్ సాంగ్ లో చేస్తుందా అనేది తెలియదు కానీ శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తే టాప్ లేచిపోవడం ఖాయం అంటున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు