Sr NTR : 24 ఇడ్లీ, 40 బ‌జ్జీలు, 2 లీట‌ర్ల‌పాలు.. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి తెలియని వారు ఉండరు. అయితే….టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. కుమారుడు బాలకృష్ణ, మనవాళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మనవరాలు అలేఖ్య రెడ్డి అంజలి ఘటించారు. కాగా, సినీరంగంలోనే కాకుండా రాజకీయరంగంలో కూడా తిరుగులేని శక్తిగా అవతరించి జనాల చేత దేవుడిగా కీర్తించబడ్డ వ్యక్తి ఎన్టీఆర్.

సిద్ధాంతాలకు మారుపేరుగా నిలిచిన ఎన్టీఆర్ షూటింగ్ టైమ్ తో పాటు ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండేవారట. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చైతన్య యాత్రలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఎక్కడ సమయం దొరికితే అక్కడ, ఏది ఉంటే అది తినేవారు. సౌకర్యాలు లేని సమయంలో సాధారణ జీవితం గడిపి ఆదర్శంగా నిలిచారు నందమూరి తారకరామారావు.

అయితే ఆయన ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్ర లేచి రెండు గంటలపాటు వ్యాయామం చేసేవారట. ఆ తర్వాత టిఫిన్ లో భాగంగా చాలా పెద్ద సైజులో ఉండే రెండు డజన్ల ఇడ్లీలను తిని, రెండు లీటర్ల పాలను తాగేవారట. ఒక్కోసారి షూటింగ్స్ వేరే ప్రాంతంలో ఉండడం వల్ల టిఫిన్ చేయడానికి కుదరకపోవడంతో ఇడ్లీలకి బదులుగా అన్నం తినేవారట. అన్నంతో తప్పకుండా నాటుకోడి మాంసం ఉండేలా చూసుకునేవాడట. ఇక సాయంత్రంపూట రెండులీటర్ల బాదం పాలను తాగేవాడట. చెన్నైలో ఉన్న సమయంలో ఎక్కువగా బజ్జీలను తినడానికి ఇష్టపడేవాడట. ఏకంగా 40 బజ్జీలను లాగించేవారట.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు