War 2: హృతిక్ – ఎన్టీఆర్ మధ్య బిగ్ ఫైట్.. ఫ్యాన్స్ కి పూనకాలు పక్కా..!

War 2: త్రిబుల్ ఆర్ మూవీ తో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరో అయిపోయినా తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.‌ ఈ మూవీ అనంతరం బాలీవుడ్ లో రూపొందుతున్న వార్ 2 లో కూడా కీలక పాత్ర పోషించనున్నాడు తారక్.

దేవర షూటింగ్ అనంతరం తారక్ వార్ 2 పై దృష్టి పెట్టనున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల అవుతుందని భావించిన మేకర్స్.. అనంతరం అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న వార్ 2 పై ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో కూడా ఎన్టీఆర్ పాల్గొన్నాడట.

Big fight between Hrithik and NTR
Big fight between Hrithik and NTR

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్,‌ హృతిక్ రోషన్ మధ్య భారీ ఫైట్స్ ఇన్ ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీన్ లో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫైట్ సీన్ ఫ్యాన్స్ కు గూస్బంస్ పుట్టించడం పక్కా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు