Nandamuri Balakrishna: బాలయ్య రిటైర్మెంట్… నందమూరి ఫ్యాన్స్‌కి షాక్

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు… ఇండస్ట్రీ పెద్ద అని కూడా తన అభిమానులు చెప్పుకుంటారు. ఇలా చెప్పుకోవడంలో తప్పు ఏం కాదు. ఎందుకంటే, బాలయ్య తరంలో ఉన్న స్టార్ హీరోలు ప్రస్తుతం ఎక్కువగా లేరు. అందులో మెగాస్టార్ చిరంజీవిని అందరూ ఇండస్ట్రీ పెద్ద అని చెబుతున్నారు. మొదటి నుంచి చిరంజీవికి పోటీ ఇచ్చే బాలయ్య… ఇప్పుడు ఇండస్ట్రీ కి పెద్ద అనే విషయంలో కూడా పోటీ ఇస్తున్నారు అంటూ నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

ఇదింత పక్కన పెడితే, బాలయ్య ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై చాలా ఫోకస్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన బావ చంద్రబాబును సీఎం చేసి కూర్చిపై కూర్చోపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాబీ దర్శకత్వంలో వస్తున్న NBK109 ఆలస్యం అవుతుందని ఓ టాక్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నందమూరి అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే…?

బాలయ్య రాజకీయాల్లో ఫోకస్ చేయడంతో సినిమాలకు దూరం కాబోతున్నారా? యాక్టింగ్ కు పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నలకు స్వయంగా నందమూరి అభిమానులు చాలా మంది అవును అనే సమాధానం ఇస్తున్నారు. అందుకు కారణం… ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో బాలయ్య పార్టీ గెలిస్తే, బాలయ్య ఈ సారి మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఓడిపోతే… ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నారట. అంటే మొత్తంగా రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉండాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కానీ, ఆ లోపు తన కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -

అందుకు ఆదిత్య 999 ను డైరెక్ట్ చేయడానికి సరైన దర్శకున్ని వెతికే పనిలో ఉన్నారట. అలాగే బాలయ్య టైం చూసుకుని బాబితో ఉన్న NBK109 పూర్తి చేస్తారని సమాచారం. అలాగే మరో సినిమా చేసే ఛాన్స్ కూడా ఉందట. 110వ సినిమా తర్వాత బాలయ్య రిటైర్మెంట్ ఉండొచ్చని టాక్.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు