Boyapati – Balayya: బోయపాటి బోర్ కొట్టాడా? అందుకే బాలయ్య ఈ డైరెక్టర్ ను దూరం పెడుతున్నాడా?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ అనగానే సింహా, లెజెండ్, అఖండ వంటి అదిరిపోయే సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు బాలయ్య మారిపోయారనీ, అదే మూస పద్ధతిలో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని, అందుకే బోయపాటిని దూరం పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ కారణం చేతనే అఖండ సీక్వెల్ ఇంకా పట్టాలెక్కలేదా? అంటే…

బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఇక డైరెక్టర్ బోయపాటి కూడా యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అయితే బోయపాటికి సైతం ఇతర హీరోలతో ఈ జోనర్ పెద్దగా వర్కౌట్ అవ్వదు అన్న విషయం ఇప్పటికే ప్రూవ్ అయింది. కేవలం బాలయ్యతో మాత్రమే ఈ డైరెక్టర్ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. అందుకే బోయపాటి ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నీ ఒకే జోనర్ లో ఉంటాయి.

అయితే బాలయ్య మాత్రం ఈ నరకడం, బాంబులు పేల్చడం వంటి రొటీన్ రొట్ట కథలతో విసుగు చెందినట్టు సమాచారం. ప్రస్తుతం తాను చేయబోయే సినిమాల జోనర్ల విషయంలో బాలయ్య మనసు మార్చుకున్నాడని టాక్ నడుస్తోంది. దానికి కారణం మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి. భగవంత్ కేసరి సినిమాతో బాలయ్యలో ఉన్న కామెడీ యాంగిల్ ను బాగా బయటకు తీశాడు అనిల్ రావిపూడి. ఆ సినిమాలో బాలయ్య వేసిన కామెడీ పంచ్ లను జనాలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. దీంతో బాలయ్య తను ఇప్పటిదాకా చేసిన ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలను పక్కన పెట్టేసి, సరికొత్త జోనర్ లో సినిమాలు చేయాలని భావిస్తున్నారట.

- Advertisement -

కానీ మరోవైపు డైరెక్టర్ బోయపాటి మాత్రం అదే జోనర్ లో, అదే బోర్ కొట్టే యాక్షన్ సన్నివేశాలతో, అవే లైన్లతో సినిమాలను ఇప్పటికీ తీస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ మారినప్పటికీ బోయపాటి కొత్త జోనర్లలో సినిమాలు తీయడం పక్కన పెట్టేసి అదే రొటీన్ ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఈ డైరెక్టర్ కు ట్రెండ్ ఫాలో అవ్వడం, లేదా ట్రెండ్ సెట్ చేయడం కష్టమా లేదా లేదంటే ఇతర జోనర్లలో సినిమాలు చేసే టాలెంట్ తనకు లేదు అని భయపడుతున్నాడో తెలియదు గానీ, కొత్త జోనర్ ను మాత్రం టచ్ చేయడం లేదు.

అందుకే బోయపాటి విషయంలో ఇతర హీరోలు జాగ్రత్తగా ఉంటూ ఆయనతో సినిమాలు చేయడానికి జంకుతున్నారు. ఇక “అఖండ 2” కూడా దాదాపుగా అలాంటి స్టోరీ లైన్ తోనే, అవే మూస పద్ధతిలో యాక్షన్ సన్నివేశాలతో ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం బోయపాటితో సినిమా అంటే బాలయ్య భయపడే పరిస్థితి నెలకొంది. ఇటీవల వచ్చిన “స్కంద” సినిమాలో కూడా బోయపాటి తన పాత చింతకాయ పచ్చడి స్టోరీనే అల్లాడు. అందుకే ఆ సినిమా తీవ్ర విమర్శలను అందుకొని డిజాస్టర్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలోనే బోయపాటి రొటీన్ స్టోరీ బాలయ్యకు బోర్ కొట్టేసిందని, అందుకే ఆయనతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తిని కనబరచకుండా బోయపాటిని దూరం పెడుతున్నాడని టాక్ నడుస్తోంది. మరి బాలయ్య మారాడు, ఈ డైరెక్టర్ ఎప్పుడు మారతాడో..?

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు