Lavanya tripathi: పెళ్లి తర్వాత మెగా కోడలికి కలిసొచ్చిందా..?

Lavanya tripathi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా హీరో వరుణ్ తేజ్ ను దాదాపు 5 సంవత్సరాలుగా ప్రేమించి గతేడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ . ఇదిలా ఉండగా వివాహం తర్వాత ఈమె నటిస్తున్న మిస్ పర్ఫెక్ట్ సీరీస్ విడుదల కాబోతోంది. మరి ఈ సీరీస్ ఈమెకు కలిసొచ్చిందా లేదా అన్నది చూద్దాం. తాజాగా లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ అనే సీరీస్ లో నటిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి ఆసక్తికర అప్డేట్స్ ఎన్నో వచ్చాయి. మధ్యలో టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. అయితే తాజాగా బ్యూటిఫుల్ ట్రైలర్ ను విడుదల చేయడం గమనార్హం.

ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా క్యారెక్టరైజేషన్ రూపొందించారు. అంతేకాదు లావణ్య క్యూట్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. లావణ్య పరిశుభ్రత పట్ల మక్కువతో పరిపూర్ణత చూపుతోంది. ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేయాలని చూస్తూ ఉంటుంది. అలాగే బిగ్బాస్ ఫేమ్ అభిజిత్ కు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. దాంతో ఫ్లాట్ మొత్తం కాస్త అపరిశుభ్రంగా మారుస్తాడు. ఇలాంటి లక్షణాలున్న వీరిద్దరూ ఒకే ప్లాట్ లో ఉండాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే సమస్యలను చాలా చక్కగా చూపించారు. ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది.

ముఖ్యంగా ఈ సీరీస్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది ఈ ట్రైలర్ అని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ సిరీస్ తో పెళ్లి తర్వాత లావణ్యకి బాగా కలిసి వస్తోంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే లావణ్య విషయానికి వస్తే.. అటు సినిమాలు ఇటు సీరీస్ లు చేస్తూ బాగా ఆకట్టుకుంటున్న ఈమె ఏ సినిమా చేసినా సరే కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని సమాచారం. కొత్తదనం నుండి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటించడానికి ఒప్పుకుంటుందట. అందుకే లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై కూడా బాగా ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికే హ్యాపీ బర్తడే, పులి మేక వంటి సినిమాలు సీరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ తో మళ్ళీ మన ముందుకు రాబోతోంది. స్కై ల్యాబ్ గా పేరుగాంచిన విశ్వక్ ఖండేరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సిరీస్ హక్కులను కొనుగోలు చేయగా.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఈ సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇందులో అభిజ్ఞ, ఝాన్సీ, మహేష్ విట్టా, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు