HBD Preity Zinta: ప్రీతి జింటా సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలిస్తే షాక్..!

 HBD Preity Zinta

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ప్రీతిజింటా.. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్గా కొనసాగింది. ఈరోజు అనగా జనవరి 31 తో ప్రీతి జింటా 47 వసంతంలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ తర్వాత అంట్రపెన్యూర్ గా మారిన ఈమె సినిమాల్లోకి రావడానికి కాయిన్ ఎగరవేసి మరి నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ వెల్లడించింది.

ఈ సందర్భంగా ప్రీతి జింటా మాట్లాడుతూ.. నేను చిన్నగా ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. కుటుంబానికి అండగా నిలవడానికి తొందరగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ముంబై వచ్చాను. అక్కడ మోడల్గా కెరియర్ మొదలు పెట్టాను.. అదే సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ నన్ను మొదటిసారి తర రమ్ పమ్ సినిమాలో నటించాలని అడిగారు. అయితే ఆయన అలా అడిగేసరికి మొదట షాక్ అయ్యాను.. కానీ అప్పుడు నాకు సినిమాలపై అంత ఆసక్తి ఉండేది కాదు.. అందుకే అది విధి నిర్ణయం అయితే తప్పక నటిస్తాను అని చెప్పి కాయిన్ ఎగర వేశాను.. బొమ్మ పడితే నటిస్తాను.. బొరుసు పడితే నటించను అని అనుకున్నాను.. కానీ బొమ్మ పడింది.. దీంతో వెంటనే ఓకే చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది..

అయితే కొద్ది రోజులకే ఆ సినిమా ఆగిపోయిందని.. ఆ మూవీ తరువాత మణిరత్నం సినిమా దిల్ సే లో నటించాను అంటూ చెప్పుకొచ్చింది ప్రీతిజింటా.. మణిరత్నం దిల్ సే సినిమా రిలీజ్ అయిన తర్వాత తర రం పం సినిమాని సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీలతో కొత్త టీం పూర్తి చేసింది.. అది కూడా విధి నిర్ణయమే కావచ్చు.. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ తెలిపింది ప్రీతి.. మొత్తానికైతే కాయిన్ ఎగరేసి సినీ కెరీర్ నిర్ణయించుకున్న ఈ బ్యూటీ కి తెలుగు ప్రేక్షకులే కాదు నార్త్ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారటంలో సందేహం లేదు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు