Monkey Man: శోభితా సెంటిమెంట్… ఇమెకు బయట గెలవడం కొత్తేమీ కాదు

Monkey Man

సూపర్ హీరో సినిమాలకు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సని పని లేదు. ఈ క్రేజ్ వల్లే మార్వల్ స్టూడియో నుంచి వచ్చిన సూపర్ హీరో సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సూపర్ హీరో సినిమాలు తెలుగు తెరపైకి కూడా వచ్చాయి. ఇటీవల ప్రశాంత్ వర్మ… హనుమ్యాన్ అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లు రావడానికి మరి కొద్ది దూరంలోనే ఉంది. పూరణాల్లో ఉన్న హనుమాన్ పవర్స్ నేపథ్యంలో ఓ కామన్ మ్యాన్ ను సూపర్ హీరోగా చూపిస్తు ఈ హనుమ్యాన్ సినిమా తెెరకెక్కించారు.

ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో మంకీ మ్యాన్ అనే సినిమా చేస్తున్నారు హాలీవుడ్ వాళ్లు. స్లమ్ డాగ్ మిలినీయర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన దేవ్ పటేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే దేవ్ పటేల్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాళ నటిస్తుంది. ఓ హాలీవుడ్ సినిమాలో శోభితకు ఛాన్స్ రావడం గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చు.

అయితే శోభితా ధూళిపాళ చెప్పుకోవడానికి తెలుగు అమ్మాయి అయినా, టాలీవుడ్ లో ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. శోభిత ఇప్పటి వరకు 11 సినిమాల్లో కనిపిస్తే అందులో రెండు మాత్రమే తెలుగు సినిమాలు ఉన్నాయి. అవి కూడా గూఢచారి, మేజర్ సినిమాలు. ఇందులో శోభిత యాక్టింగ్ బాగానే ఉన్నా… పేరు మొత్తం హీరో అడవి శేషుకే వచ్చిన సంగతి తెలిసిందే. ఇక పక్క భాషలో చేసిన కురుప్, PS సినిమాలు ఈమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇంకా ఇతర భాషల్లో చేసిన సినిమాలు హిట్ కూడా అయ్యాయి. ఇప్పుడు ఈ సెంటిమెంట్ మంకీ మ్యాన్ కు కూడా కలిసి రావొచ్చు. ఇదే జరిగితే.. ఇంట గెలవలేదు కానీ, బయట మాత్రం గెలవస్తుంది అంటూ శోభితా ధూళిపాళపై ఉన్నది మరోసారి నిజం అవుతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు