Adavi sheshu: గూడచారి” సీక్వెల్ లో లండన్ బ్యూటీతో అడవి శేష్ రొమాన్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. చిన్న చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి ఇండియా మొత్తం ఇమేజ్ సంపాదించుకున్నాడు అడవి శేష్. 2010లో కర్మ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా అతనే. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. హీరోగా అడివి శేష్ కి క్షణం మూవీ బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత శేష్ కథ అందించగా.. శశికిరణ్ దర్శకత్వం వహించిన గూడచారి సినిమా భారీ హిట్ గా నిలిచింది.

స్పై యాక్షన్ త్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. శోభిత ధూళిపాళ్ల, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, మధుశాలిని కీలక పాత్రలలో నటించగా.. అక్కినేని సుప్రియ ఈ చిత్రంతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ గూడచారి సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు అడవి శేష్.

ఈ సినిమాతో వినయ్ కుమార్ దర్శకుడిగా వెండితెరకు అరంగేట్రం చేస్తున్నాడు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

- Advertisement -

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం మోషన్ టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ నుండి మరో అదిరిపోయే అప్డేట్ ని అందించారు మేకర్స్. గూడచారి 2 (G2) లో హీరోయిన్ గా బనితా సంధు నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. లండన్ లో పుట్టి పెరిగిన బనిత సంధు బాలీవుడ్ మూవీ అక్టోబర్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో సౌత్ ఇండస్ట్రీలో తొలి అడుగు వేసింది. తాజాగా గూడచారి సీక్వెల్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దుగుమ్మ.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు