Full Moon Media Productions: చిన్న మూవీకే మూడు చెరువుల నీళ్లు తాగేశారు… వీళ్ళు ఆ హీరోను మేనేజ్ చేస్తారట !

బిగ్ బాస్ 5 విన్నర్ విజయ సన్నీ రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ”. ఈ మూవీకి సంజయ్ దర్శకత్వం వహించగా, రవి పొలిశెట్టి, గజేంద్ర మహేంద్ర, శ్రీశ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 24న “సౌండ్ పార్టీ” మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ స్టార్ట్ కాగా, మూవీ ప్రొడక్షన్ హౌస్ ఫుల్ మూన్ మీడియా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

నిజానికి ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఇదే ఫస్ట్ మూవీ. అయితే సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టుగా ఫస్ట్ మూవీనే ఇంతకుముందు వరుస డిజాస్టర్లు అందుకున్న, ఏమాత్రం ఫామ్ లో లేని సన్నీతో తీసి పొరపాటు చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు. ఇక “సౌండ్ పార్టీ” మూవీ కోసం ముందుగా నిర్మాతలు అనుకున్న బడ్జెట్ ఒకటైతే, సినిమా తీసేసరికి అది ఇంకో లెవెల్ కి వెళ్లి పోయిందని ఫిలింనగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నిజానికి సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో అనుకున్నారట. కానీ ఫుల్ మూన్ ప్రొడక్షన్ హౌస్ కి ఇదే మొదటి చిత్రం కావడంతో బడ్జెట్ ను కంట్రోల్ చేయలేకపోయారట. మరి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ ను పెట్టేసిన నిర్మాతలు దాన్ని తిరిగి ఎలా రాబట్టుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

నిజానికి “సౌండ్ పార్టీ” మూవీ రిలీజ్ కు చాలా సమయం ఉందట. అంటే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను నవంబర్ 24న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ అసలు ప్లాన్ కాదట. అయితే ఆ తరువాత మూవీ రిలీజ్ కి టైం కావాలన్నా దొరకడు. అందుకే సడన్ గా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. పైగా ఓ చిన్న నటుడితో చేస్తున్న ప్రయోగాన్ని సోలోగా రిలీజ్ చేసుకోకుండా యంగ్ మెగా హీరో వైష్ణవ తేజ్ ‘ఆదికేశవవ’, ‘కోట బొమ్మాలి’ లాంటి మిడ్ రేంజ్ సినిమాలు వస్తున్న టైంలో పోటీకి దిగుతున్నారు. నిజానికి ఇలాంటి మిడ్ రేంజ్ సినిమాలు వస్తున్న టైంలో చిన్న సినిమాలు రిలీజ్ చేయకూడదన్న విషయం కూడా ఫుల్ మూన్ ప్రొడక్షన్ హౌస్ కి తెలియదా?

- Advertisement -

ఇవన్నీ ఆలోచిస్తుంటే ఫుల్ మూన్ ప్రొడక్షన్ హౌస్ తప్పు మీద తప్పు చేస్తుంది ఏమో అనిపిస్తుంది. సినిమాకు ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా వీళ్ళు నిండా మునిగిపోవడం ఖాయం. ఇక సన్నీతో మూవీనే కంట్రోల్ చేయలేకపోయినా ఫుల్ మూన్ ప్రొడక్షన్ హౌస్ ఆ తర్వాత ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న హీరో కిరణ్ అబ్బవరంతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉందట.ఇతను ఉంటే సినిమా గ్యారంటీగా హిట్ అన్నది ప్రస్తుతం ఉన్న ప్రొడ్యూసర్స్ ఒపీనియన్. దీంతో ఫుల్ మూన్ ప్రొడక్షన్ హౌస్ కూడా తన నెక్స్ట్ మూవీని కిరణ్ అబ్బవరంతో చేయాలని చూస్తోందట. అయితే కిరణ్ అబ్బవరంతో సినిమా అంటే తమ ఫస్ట్ సినిమా కంటే బడ్జెట్ ఎక్కువగానే ఉంటుంది. మరి సన్నీ లాంటి చిన్న నటులతో సినిమా బడ్జెట్ నే కంట్రోల్ చేయలేక ముప్పు తిప్పలు పడి మూడు చెరువుల నీళ్లు తాగిన ఫుల్ మూన్ ప్రొడక్షన్ హౌస్ కిరన్ అబ్బవరం సినిమాను మేనేజ్ చేయగలదా?

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు