Hair Growth Yoga Tips: జుట్టు రాలిపోతోందా… ఈ యోగాసనాలను ట్రై చేయండి

ఏజ్ పెరిగేకొద్దీ అమ్మాయిల్లో అయినా, అబ్బాయిల్లో అయినా జుట్టు రాలడం వంటి సమస్యలు సర్వసాధారణం. ప్రతి ఒక్కరికీ జుట్టు అనేది ఇప్పుడు ఎమోషన్ గా మారిపోయింది. అంతేకాకుండా మంచి జుట్టు ఉంటే రూపాన్ని మరింత ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా చేస్తుంది. అయితే వాతావరణం, కాలుష్యం, పోషకాహారం సరిగ్గా లేకపోవడం, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ జుట్టును ప్రభావితం చేస్తాయి. చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు రాలడంతో పాటు పెరుగుదల కూడా ఆగిపోతుంది. గ్రే హెయిర్ మరో పెద్ద సమస్య. ఇక జుట్టు పొడవుగా, ఒత్తుగా, నల్లగా ఉండేందుకు చాలా రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయితే ఈ ఉత్పత్తులు కొన్నిసార్లు నెగెటివ్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అయితే సహజంగా యోగాసనాల ద్వారా జుట్టును పెంచుకోవచ్చు, మరి ఎలాంటి యోగాసనాలు చేస్తే జుట్టు పెరుగుతుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

శీర్షాసనం:
ఈ ఆసనాన్ని హెడ్‌స్టాండ్ పొజిషన్ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడం వల్ల తలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఇది జుట్టు రాలడం, పల్చబడడం, తెల్లబడడం వంటి సమస్యలను రాకుండా చేస్తుంది. కాళ్ళు పైకి చేసి, తలను క్రింద పెట్టడమే శీర్షాసనం. గోడ సహాయంతో స్టార్ట్ చేసి, తరువాత గోడ లేకుండా అవసరం లేకుండా కూడా ఈ ఆసనం వేయవచ్చు.

Do these yoga tips to grow hair fast

- Advertisement -

త్రికోనాసనం:
జుట్టు చిన్న వయసులోనే నెరిసిపోయి, పొడిబారినట్లయితే త్రికోణాసనం బెస్ట్. ఈ ఆసనం వేయడానికి రెండు పాదాలను దూరంగా ఉంచి నిలబడాలి. తరువాత ఒక చేతిని కాలిపై ఉంచి, మరో చేతిని అపోజిట్ లో లేపాలి. తరువాత అలాగే మరో చేతిని కూడా.

Do these yoga tips to grow hair fast

భుజంగాసనం:
వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరగాలంటే క్రమం తప్పకుండా భుజంగాసనం వేయండి. ఈ ఆసనం చేయడానికి బోర్లా పడుకుని,శరీరం ముందు భాగాన్ని పైకి ఎత్తండి. మీ చేతులను నిఠారుగా ఉంచి, కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. తర్వాత శ్వాస వదులుతూ సాధారణ స్థితిలోకి రావాలి. దీన్ని స్నేక్ స్ట్రెచ్ అని కూడా అంటారు.

Do these yoga tips to grow hair fast

మత్స్యాసనం
ఈ ఆసనాన్ని ఫిష్ పోజ్ పేరుతో కూడా పిలుస్తారు. మీకు జుట్టుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే లేదా జుట్టు పెరుగుదలను వేగవంతం చేయాలనుకుంటే, ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని ఇంట్లోనే చాలా సులభంగా చేయవచ్చు. దీని ద్వారా ఆక్సిజన్ సరైన పరిమాణంలో తలకు చేరుతుంది. తద్వారా హెయిర్ ఫోలికల్స్ పెరుగుదలకు సహాయపడతాయి. ఇంకా సర్వంగాసనం, బలాసనం, వజ్రాసనం, ఉత్తానాసనం కూడా జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి.

Do these yoga tips to grow hair fast

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు