Krishnam Raju: భార్య ఉండగానే అలాంటి పని చేసిన కృష్ణంరాజు.. చివరికి..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు? ఏ విషయం? ఏ విధంగా ? వైరల్ అవుతుందో చెప్పడం అసాధ్యం.. వాస్తవానికి అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం సెలబ్రిటీల పైన ఎక్కువగా ఉండేది కాదు.. కానీ ఇప్పుడు సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా బయటకు వచ్చిందంటే దానిని వివిధ కోణాలలో ప్రచురిస్తూ సెలబ్రిటీలను ట్రెండ్ చేస్తూ ఉంటారు.

అయితే ఇది కొంతమందిని హర్ట్ చేస్తే మరి కొంత మంది చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడైతే సోషల్ మీడియా బాగా ప్రచారంలో ఉంది కాబట్టి సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం వైరల్ అవుతూ రకరకాల రూమర్లు కూడా సృష్టించబడుతూ ఉంటాయి.

కానీ అప్పట్లో ఎంతటి రూమర్ ఉన్నా సరే పెద్దగా బయటకి వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ విషయం బయటకు వచ్చేది.. అలా ఒకానొక సందర్భంలో కృష్ణంరాజు కూడా ఇలాంటి ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారట. అప్పట్లో కృష్ణంరాజు, వాణిశ్రీ జంటకు మంచి పేరు ఉండేది. మొదట వీళ్ళిద్దరి కాంబినేషన్లో కృష్ణవేణి సినిమా వచ్చింది.. ఈ సినిమా మంచి విజయం కావడంతో అప్పటినుంచి కృష్ణంరాజు హీరోగా నటించిన చాలా సినిమాలలో వాణిశ్రీ కి హీరోయిన్గా అవకాశం కల్పించారు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భక్త కన్నప్ప సినిమా కూడా చరిత్ర సృష్టించింది.

- Advertisement -

అలా దాదాపు 8 సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో రావడంతో ఇక వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు సృష్టించారు. అంతేకాదు ఇద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ కథనాలు అల్లేసారు. ఈ విషయం కాస్త కృష్ణంరాజు ఇంటి సభ్యులకు చేరింది.. దీంతో వారు కూడా కృష్ణంరాజును అనుమానించారట.

అంతేకాదు భార్య ఉండగానే ఇదేం పాడు బుద్ధి అంటూ కుటుంబ సభ్యులు మందలించారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక దీంతో చేసేదేమీ లేక ప్రెస్ మీట్ పెట్టి కృష్ణంరాజు వాణిశ్రీ తో తనకున్న బంధాన్ని వెల్లడించారు.

వాణిశ్రీ తనకు కేవలం ఒక స్నేహితురాలు మాత్రమేనని అయితే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుండడం వల్ల తమ సినిమాలు సక్సెస్ అవుతున్నాయని.. అందుకే తామిద్దరం కలిసి వరుస సినిమాలు చేస్తున్నామని ప్రకటించారు కృష్ణంరాజు. ఇకపోతే కృష్ణంరాజు కూడా అప్పట్లో అలాంటి వార్తలను ఎదుర్కోవడం గమనార్హం ఇక వాణిశ్రీ విషయానికి వస్తే.. ఒకప్పుడు వరుస సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయింది.

 

 

 

 

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు