Jagapatibabu: కొడుకు కోసం అలాంటి పని చేయాలనుకున్న జగపతిబాబు.. కట్ చేస్తే..

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని ఇప్పుడు విలన్ గా లెజెండ్ సినిమాతో సరికొత్త అవతారం ఎత్తి భారీ పాపులారిటీ దక్కించుకున్న జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు అన్ని సినిమాలతో మంచి విజయం అందుకున్న.

ఈయన ఒకవైపు హీరోగా మరొకవైపు విలన్ గా అలాగే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఈయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలని తెరకెక్కిస్తూ మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎక్కువగా తన అభిమానులుగా మార్చుకున్న జగపతిబాబు ఇప్పుడు మరొకసారి విలన్ గా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.

సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే ఈయన టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషా చిత్రాలలో కూడా నటిస్తూ పేరు సంపాదించుకున్నారు. ఇటీవల హాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చాయని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇకపోతే కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న జగపతిబాబు.. వ్యక్తిగత విషయానికి వస్తే మాత్రం.. తన కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములకు ఎవరికీ కూడా మగ పిల్లలు లేరట. ఈయనకి కూడా ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో.. జగపతిబాబు తండ్రి తమకు వారసులు లేరని ఎక్కువగా ఫీల్ అయ్యేవారట. అయితే ఇదే విషయాన్ని జగపతిబాబుని అడగగా.. తానెప్పుడూ కొడుకులు లేరని బాధపడలేదని.. కొడుకులు ఉంటేనే హీరోలుగా పరిచయం చేయాలని లేదని.. కూతుర్లను కూడా హీరోయిన్స్ గా తన వారసులుగా ఇండస్ట్రీకి పరిచయం చేయొచ్చు అంటూ జగపతిబాబు తెలిపారు.

అంతేకాదు ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. చాలామంది అమ్మాయిలు హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అయితే మా అమ్మాయిలకు సినిమాలంటే ఆసక్తి లేకపోవడం వల్లే వారు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.. మా నాన్నకి వారసులు లేరనే ఫీలింగ్ ఎక్కువగా ఉండేది. తరచూ నా దగ్గర ఇదే విషయం ప్రస్తావిస్తూ ఉండేవారు.

దాంతో కోపం వచ్చి వారసులు లేకపోతే ఎవరినైనా తెచ్చుకొని పెంచుకోమంటావా అంటూ తన తండ్రిని అడిగానని జగపతిబాబు తెలిపారు. ఇకపోతే ఎవరినైనా దత్తత తీసుకుంటాను అన్నా.. కానీ మా నాన్న వద్దని చెప్పారని జగపతిబాబు తెలిపారు. ఏది ఏమైనా వారసుల కోసం భార్యలను హింసిస్తున్న ఈ రోజుల్లో కూడా జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు