Mrunal Thakur : యాటిట్యూడ్ తగ్గించాలమ్మ… లేదంటే బాధ పడతావ్

“సీతారామం” వంటి బ్లాక్ బస్టర్ మూవీలో సీతగా నటించి, తెలుగు ఆడియన్స్ మనసు కొల్లగొట్టేసింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు పలు హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “హాయ్ నాన్నా” డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో మృణాల్ నానితో రొమాన్స్ చేసింది.

ఇప్పుడు టాలీవుడ్ లో మృణాల్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాల్సిన మృణాల్, దాన్ని మిస్ యూజ్ చేసుకుంటోందట. అందుకు కారణం ఆమె చూపిస్తున్న యాటిట్యూడ్ అని టాక్.

మృణాల్ ఠాకూర్ చిత్ర నిర్మాతలను ఇబ్బంది పడుతోంది అనే వార్థ ఇప్పుడు ఆమె అభిమానులను కలవర పెడుతోంది. ఏ బ్యూటీ తన సినిమాల ప్రమోషన్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. “హాయ్ నాన్నా” సినిమా ప్రమోషన్ల విషయంలో ఇదే జరుగుతోందట. పైగా బిజీ షెడ్యూల్ అంటూ కుంటి సాకులు చెప్తోందట. నిజానికి ఈ సినిమాకు సైన్ చేసేటప్పుడే, ప్రమోషన్లలో పాల్గొనడానికి, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఒప్పుకుందట. ఇప్పుడు చూస్తే ఏదో ఒక సాకు చెప్పి ప్రమోషన్లకు రాకుండా తప్పించుకుంటోందట. ఇక చేసేదేం లేక నాని మాత్రమే ‘హాయ్ నాన్న” ప్రమోషన్స్ ను భుజాన వేసుకున్నాడు.

- Advertisement -

మరో టాక్ ఏంటంటే… మృణాల్ ఠాకూర్ తన సినిమాల సెట్స్‌కి సమయానికి వెళ్లడం లేదట. ప్రస్తుతం టాలీవుడ్ లో మృణాల్ వైఖరిపై తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయట. ‘హాయ్ నాన్న’ షూటింగ్ సెట్ లో ఈ అమ్మడి కోసం నానితో పలువురు నటీనటులు చాలా సమయం వెయిట్ చేయాల్సి వచ్చిందట. ఒకానొక సమయంలో ఈ బ్యూటీ వల్ల షెడ్యూల్ వాయిదా కూడా పడిందని టాక్. అంతేకాదు ఆమె నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ చేస్తోంది. ఈ మూవీకి కూడా అలాగే లేట్ గా వెళ్తోందట.

ఇలా యాటిట్యూడ్ చూపిస్తే టాలీవుడ్ లో నిలదొక్కుకోవడం కష్టం. మేకర్స్ మృణాల్ ను పూర్తిగా సైడ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల సందడి చేస్తోంది. ఆమె ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. మరి రెండు సినిమాలకే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్న మృణాల్ కు టాలీవుడ్ లో కెరీర్ ఎండ్ అయ్యే టైం దగ్గర పడినట్టేనా?

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు