Venkatesh: వివాదంలో వెంకిమామ

Venkatesh:  విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్. కెరియర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా మంచి పాజిటివ్ గా ఉంటూ అందరినీ నవ్విస్తూ, అందరిని మోటివేట్ చేస్తూ చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు విక్టరీ వెంకటేష్.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి నెగెటివిటీ లేని హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు. చాలామందికి విక్టరీ వెంకటేష్ ఒక రకమైన ఇన్స్పిరేషన్. అందరూ అభిమానులు ఫ్యాన్స్ కూడా విక్టరీ వెంకటేష్ ని ఇష్టపడుతూ ఉంటారు. సినిమాల్లో కామెడీ తో పాటు ఎమోషన్ పండించడంలో కూడా వెంకటేష్ దిట్ట అని చెప్పొచ్చు. అయితే వెంకటేష్ కెరియర్ లో ఇప్పటివరకు బ్యాడ్ ఎలివేషన్స్ అంటూ రాలేదు.

వివాదాలకి ఎప్పుడూ దూరంగా ఉంటుంది ఈ ఫ్యామిలీ.
ఇప్పటివరకి ఈ ఫ్యామిలీ ఏదైనా వివాదంలో చిక్కుకుంది అంటే అది శ్రీరెడ్డి కి సంబంధించిన వివాదం మాత్రమే, దానిని కూడా చాలా చాకచక్యంగా డీల్ చేశారు అప్పట్లో.కాగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ పై ఒక క్రిమినల్ కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ కూల్చివేత‌కు సంబంధించి బాధితుడు కె.నందకుమార్ వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు లో విచారణ జరగనుంది. దగ్గుబాటి వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రానా దగ్గుబాటి, దగ్గుపాటి అభిరామ్ ల పై నాంపల్లి కోర్టు కేసు నమోదుకు ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -

ఇక వెంకటేష్ సినీ కెరియర్ తీసుకుంటే, రీసెంట్ గా సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు