Vijay: లియో డైరెక్టర్ పై విజయ్ తండ్రి షాకింగ్ కామెంట్స్..!

Vijay:  కోలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో దళపతి విజయ్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు.. ఈయన తండ్రి ఎస్ చంద్రశేఖర్ కూడా కోలీవుడ్లో నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు.ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈయన.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో జరిగిన ఒక ఫోన్ కాల్ సంభాషణ గురించి పలు విషయాలను తెలియజేశారు.. తన కొడుకు నటించిన లియో సినిమా పై స్పందిస్తూ.. సెకండాఫ్ బాగోలేదని డైరెక్ట్ గా చెప్పేసాను అంటూ తెలియజేశారు విజయ్ తండ్రి.

అయినప్పటికీ ఆ డైరెక్టర్ తన మాట వినకుండానే ఫోన్ కట్ చేశారని తెలిపారు. ప్రస్తుతం చంద్రశేఖర్ చేసిన కొన్ని కామెంట్స్ కోలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. లియో సినిమా ఐదు రోజుల విడుదలకు ముందు ఫస్ట్ కాపీ చూశాను.. వెంటనే డైరెక్టర్ కి ఫోన్ చేసి మొదటి భాగం అద్భుతంగా ఉంది.. సినిమాలు తీయాలంటే ఎలా తీయాలో మీ దగ్గర నేర్చుకోవాలని చెప్పాను. అయితే ఈ మాటలన్నీ ఓపిగ్గా విన్న డైరెక్టర్ లోకేష్.. సెకండాఫ్ బాగలేదు.. కొన్ని లోపాలు ఉన్నాయి సరి చేయమని చెబితే వెంటనే ఫోన్ కట్ చేశారని తెలిపారు చంద్రశేఖర్..

ఆ తర్వాత ఫోన్ చేసి.. సినిమా చూసిన తర్వాత అందరికీ తనకు వచ్చిన సందేహాలను వ్యక్తం చేస్తారు అని మళ్లీ చెప్పుకొచ్చారట లోకేష్ కనగరాజు. దళపతి విజయ్ దగ్గరకు వచ్చే ప్రతి కథను కూడా.. విజయ్ తండ్రిగా కాకుండా కేవలం ఒక అభిమానిగా మాత్రమే కథను వింటానని.. అందులో ఎలాంటి సందేహాలు ఉన్నా అడిగి తెలుసుకుంటాను అని తెలిపారు. ప్రస్తుతమున్న పరిస్థితులలో కొంతమంది డైరెక్టర్ లు స్క్రీన్ ప్లే కి ఎవరు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. తమ సినిమాలలో స్టార్ హీరో ఉంటే చాలు కథ లేకపోయినా ఆడుతుందనే నమ్మకంతో ఉంటున్నారు..

- Advertisement -

ఒకరకంగా చెప్పాలంటే.. హీరో వల్లే కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి.. తాను ఏదో గొప్ప అన్నట్లుగా కొంతమంది డైరెక్టర్లు భావిస్తూ ఉంటారు.. కథ బాగుంటే అది భారీ విజయాన్ని అందుకుంటుందని తన అభిప్రాయంగా తెలియజేశారు చంద్రశేఖర్.. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎవరికి వారు తప్పు చేసినప్పటికీ ఆ తప్పును అంగీకరించే ధైర్యం చేయలేకపోతున్నారు.. వారు ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంటామని చెబుతూ వుంటారని తెలిపారు. ప్రస్తుతం చంద్రశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు డైరెక్టర్ లోకేష్ కనగరాజు గురించి అన్నట్లుగా తెలుస్తోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు