Guntur Kaaram: మహేష్ కెరియర్ లో మరో రికార్డ్

Guntur Kaaram: త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి పడిన ప్రీమియర్ షోస్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మహేష్ బాబుకి ఉన్న కమర్షియల్ ఇమేజ్ ని బట్టి, అలానే సినిమా టీం ఈ సినిమా గురించి చెప్పిన విధానాన్ని బట్టి ఇది ఒక కమర్షియల్ సినిమా అనుకుంటూ థియేటర్స్ కి ఆడియన్స్ వెళ్లారు. కానీ థియేటర్ కి వెళ్లిన తర్వాత ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ సినిమా అని అర్థమైంది. అందుకే ఈ సినిమాకి మొదట మిక్స్డ్ టాక్ వచ్చింది.

తర్వాత ఈ సినిమాపై మెల్ల మెల్లగా అంచనాలు, అభిప్రాయాలు మారడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి రావడం మొదలయ్యారు. అక్కడితో మెల్లగా ఈ సినిమా కూడా సేఫ్ జోన్ కి రావడం మొదలైంది. ఇక మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ ను బట్టి ఈ సినిమా బాగానే రన్ అయింది. ఇకపోతే హైదరాబాద్ లో సుదర్శన్ థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మహేష్ బాబుకి సుదర్శన్ థియేటర్ కి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చాలా సినిమాలు మహేష్ బాబు అభిమానులు సుదర్శన్ థియేటర్లో చూడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ థియేటర్ కి ఉన్న ప్రత్యేకత అలాంటిది.

ఇప్పటివరకు సుదర్శన్ థియేటర్లో కోటి రూపాయలు గ్రాస్ క్రాస్ చేసిన సినిమాలు మహేష్ కెరియర్ లో ఆరున్నాయి. ఇకపోతే రీసెంట్గా రిలీజ్ అయిన గుంటూరు కారం కూడా ఒక ఆల్ టైం రికార్డ్ ను సృష్టించింది. ఫాస్టెస్ట్ వన్ క్రోర్ గ్రాస్ ఫిలిం గా కేవలం 17 రోజుల్లోనే కోటి రూపాయలు గ్రాస్ ను క్రాస్ చేసింది. ఇకపోతే ఇదివరకే మహేష్ కెరియర్ లో వచ్చిన మురారి, ఒక్కడు, పోకిరి, అతడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు కోటి రూపాయలు గ్రాస్ ను వసూలు చేశాయి.

- Advertisement -

ఇక రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమా చాలా ఫాస్ట్ గా ఈ గ్రాస్ ను దాటేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో మహేష్ సరసన శ్రీ లీల నటించింది. ఈ సినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ, జయరాం రమేష్, ప్రకాష్ రాజ్,రావు రమేష్ మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు