Mahesh Babu: గుంటూరు కారం సినిమాలో మహేష్ కాల్చిన బీడీలు నిజమైన వేనా ?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం. మొన్న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఇక ఈ మూవీలో మహేష్ బాబు సరసన శ్రీ లీల నటించింది. అటు మీనాక్షి చౌదరి ఓ కీలక పాత్ర పోషించారు. ఇక మొన్న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇంకా విజయవంతంగా థియేటర్లలో నడుస్తోంది గుంటూరు కారం సినిమా. ఇప్పటికే ఈ సినిమా 150 కోట్లు దాటేసింది.

సినిమా సక్సెస్ కావడంతో మహేష్ బాబు మరియు హీరోయిన్ శ్రీ లీల వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు మహేష్ బాబు మరియు శ్రీ లీల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఆసక్తికర విషయాలు సినిమా గురించి పంచుకున్నారు.

వాసవానికి గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఊర మాస్ గా కనిపించాడు. ముఖ్యంగా ప్రతి సీనులో కూడా మనకు బీడీ కాల్చితూ మహేష్ బాబు కనిపిస్తారు. అయితే ఈ బీడీ కాల్చడంపై మహేష్ బాబు ఓ సీక్రెట్ చెప్పారు. తాను స్మోకింగ్ చేయనని… స్మోకింగ్ చేయాలని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయనని వెల్లడించారు. అయితే సినిమా కోసం వాడిన బీడీలు నిజమైనవి కావని…. అవి ఆయుర్వేదిక్ బీడీలు అని స్పష్టం చేశారు మహేష్ బాబు. ఆ బీడీలలో పొగాకు ఉండదని… అందులో లవంగం మరియు యాలకులు ఉంటాయని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు