Pawan kalyan : కష్టాల్లో ఉన్న మహేష్ బాబుకు సహాయం చేసిన పవన్ కళ్యాణ్…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరి గురించే ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అతి చిన్న వయసు నుంచే ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వేరే నటన, అభిమానానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ హీరోలకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగానే ఉంది. ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి స్నేహం ఉంది.

వీరు తమ సినీ కెరియర్ ప్రారంభించకముందు సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్నారట. అప్పటినుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదట. ఇక పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో మహేష్ బాబు హీరోగా నటించిన “ఒక్కడు” సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా సమయంలో మార్కెట్లో ఒక్కడు సినిమాకు సంబంధించి పైరసీ వీడియోలు దొరికాయి. దీనికి వ్యతిరేకంగా మహేష్ బాబు చాలా పోరాటం చేశాడు. ఆ సమయంలో మహేష్ బాబుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలిచారు.

తాను చేయవలసినంత సహాయం చేసి మహేష్ బాబుకి ఎంతో సపోర్టుగా నిలిచారట. వీరిద్దరూ కలిసి పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్లనే కొంతవరకు ఆ గొడవ తగ్గిందట. ఇక ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. మహేష్ బాబుకి ఈ సినిమాతో స్టార్ ఇమేజ్ దక్కింది. ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చేసిన సహాయం వల్ల వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందట.

- Advertisement -

ఇక పవన్ కళ్యాణ్ నటించిన “జల్సా” సినిమాలో వాయిస్ ఓవర్ ఇవ్వమని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా మహేష్ బాబును అడిగాడట. ఇక ఆ సమయంలో మహేష్ బాబు ఏమాత్రం ఆలోచించకుండా వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఒక హీరో సినిమాకి మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పటి నుంచే ప్రారంభమైందట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోందట.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు