Samantha: క్యూట్‌ అందాలతో మెరిసిన సమంత… పండుగ టైంలో ఆ పని చేస్తూ !

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హీరోయిన్లలో సమంత ఒకరు. ‘ఏమాయ చేసావే’తో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సమంత… అప్పటినుంచి ఎన్నో చిత్రాల్లో తనదైన గ్లామర్ పాత్రలను చేసి స్టార్ గా ఎదిగింది. అయితే, ఈ మధ్యకాలంలో మాత్రం ఆమె పంథాను మార్చుకుని తన రోల్ కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలనే చేస్తోంది. ఇలా ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకుంది.

దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరింతగా దూసుకుపోతోంది. తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో సందడి చేస్తున్న సమంత…. ఆ మధ్య ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో నటించి….బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్రతో నేషనల్ రేంజ్ గుర్తింపును దక్కించుకుంది.

చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరిపించే నటనతో దాదాపు 16 ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది టాలెంటెడ్ హీరోయిన్ సమంత. గతంలో కంటే ఈ మధ్యకాలంలో తన రేంజ్ ను మరింతగా పెంచుకున్న ఈ భామ వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా…. సోషల్ మీడియాలోనూ సమంత యమ రచ్చ చేస్తూనే ఉంది.

- Advertisement -

అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో గాలిపటం ఎగురవేస్తూ తాజాగా కనిపించింది సమంత. తన ఫ్లాట్ టెర్రస్ పైన గాలిపటం ఎగురవేస్తూ అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది సమంత. ఈ ఫోటోలలో చేతిలో గాలిపటం పట్టుకున్న సమంత… తన క్యూట్ స్మైల్ తో అందరిని కనిపింది చేస్తోంది. ఎంతో జాలిగా కూడా ఈ ఫోటోలో ఉంది సమంత. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Samantha shines with cute beauty..doing that!

Samantha shines with cute beauty..doing that!

Samantha shines with cute beauty..doing that!

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు