Disco Shanthi : ప్రకాష్ రాజ్ తో బలవంతంగా ఆ పని చేసిన డిస్కో శాంతి..!

Disco Shanthi:  తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నటుడు ప్రకాష్ రాజ్.. ఎన్నో చిత్రాలలో హీరో గానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా సౌత్ ఇండస్ట్రీలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగిన ఈయన విలక్షణమైన నటుడుగా కూడా పేరు సంపాదించారు ప్రకాష్ రాజ్.. ఇలాంటి ప్రకాష్ రాజ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. అయితే మొదటి భార్య కి మాత్రం విడాకులు ఇచ్చారు.. అయితే మొదటి భార్య కి విడాకులు ఇవ్వడం వెనుక అసలు కారణం ఏమిటి? అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు..

ప్రకాష్ రాజ్ మొదటి వివాహాన్ని చాలా బలవంతంగా చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా నటుడు శ్రీహరి ప్రకాష్ రాజ్ ఇద్దరూ కూడా వరుసకు అన్నదమ్ములవుతారట.. ఎందుకంటే ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి శ్రీహరి భార్య డిస్కో శాంతి ఇద్దరూ కూడా అక్కచెల్లెళ్లే.. అందువల్లే ప్రకాష్ రాజ్ శ్రీహరి ఇద్దరు కూడా వరుసకు అన్నదమ్ములవుతారు.. డిస్కో శాంతి తండ్రి మరణించడంతో మొత్తం బాధ్యత తన మీదే వేసుకుంది. అలా సినిమాలలో ఐటెం సాంగ్స్ చేస్తూ కుటుంబాన్ని సైతం పోషించేదట.

లలిత కుమారి కూడా పలు ఇండస్ట్రీలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఉండేది. అలా చేస్తున్న సమయంలో లలిత కుమారికి ప్రకాష్ రాజ్ కి మధ్య ప్రేమ కలగడంతో ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారట..ఈ విషయం తెలుసుకున్న డిస్కో శాంతి త్వరగా తన చెల్లికి వివాహం చేసి తన బాధ్యత తీర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది కానీ ఆ సమయంలో ప్రకాష్ రాజ్ నేను ఇప్పుడే వివాహం చేసుకోను ఇండస్ట్రీలో నాకు కూడా ఒక పేరు సంపాదించుకున్న తర్వాతే వివాహం చేసుకుంటానని చెప్పారట.

- Advertisement -

కానీ డిస్కో శాంతి మాత్రం ప్రకాష్ రాజ్ ఎంత చెప్పినా కూడా వినకుండా తన సోదరిని ఇచ్చి బలవంతంగానే వివాహం చేయించింది.. వివాహమైన తర్వాత చాలా రోజులు బాగానే ఉన్నా.. ప్రకాష్ రాజ్ – లలిత కుమారి మధ్య విభేదాలు రావడం తో కొన్ని కారణాల చేత విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక లలిత కుమారికి ఇద్దరు కూతుర్లతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు. కానీ కుమారుడు మరణించడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు.. ఇక చాలా రోజులకి బాలీవుడ్లో నాట్యకారిణిగా పేరుపొందిన పోనీ వర్మాను ప్రకాష్ రాజ్ మరొకసారి ప్రేమించి మరీ వివాహం చేసుకోవడం జరిగింది. ఈ జంట కి కూడా కొడుకు పుట్టారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు