Harish Shankar: వారిని ఉద్దేశించేనా ఆ మాటలు.. ట్వీట్ వైరల్..!

Harish Shankar:  తెలుగు సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్గా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడా ఒకరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల చేత వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతోంది. ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ అనే ఒక సినిమాని మొదలుపెట్టారు.

ఈ చిత్రం బాలీవుడ్ లో రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. హీరోయిన్ గా బాలీవుడ్ నటిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.. రవితేజ – హరిష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా ఇది. గతం నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఇండస్ట్రీలో ఎలాంటి విషయం అయినా సరే మీరు మొహమాటంగా ముక్కుసూటిగానే మాట్లాడే వ్యక్తులలో హరీష్ శంకర్ ముందు వరుసలో ఉంటారు..

అప్పుడప్పుడు తనదైన స్టైల్ లో మీడియాలో కూడా కౌంటర్లు వేయడం వంటివి చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా హరీష్ శంకర్ యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పలు రకాల పోస్టులు పెడుతూ ఎవరికో ఒకరికి కౌంటర్లు వేస్తూ ఉంటారు.. అయితే అవి తగలాల్సిన వారికి చాలా గట్టిగానే తగులుతాయని ఇండస్ట్రీలో వార్తలైతే వినిపిస్తూ ఉంటాయి.. తాజాగా హరీష్ శంకర్ మరోసారి తన ట్విట్టర్ నుంచి ఒక ట్వీట్ షేర్ చేశారు.

- Advertisement -

అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనే విషయం మాత్రం తెలియలేదు..”ఇక్కడ ఎవరికీ ఎవరి మీద నెగెటివిటీ అనేది ఉండదు.. ఒకవేళ ఉన్నప్పటికీ.. ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారంటూ.. ఎవడన్న పక్కోడు అపజయాన్ని చూసి డాన్స్ వేస్తే.. కచ్చితంగా రేపు వాడి అపజయానికి గ్రూప్ డాన్సర్లు రెడీ అవుతారు” అంటూ ట్వీట్ చేశారు.. గోల్డెన్ వర్డ్స్ ఫ్రమ్ మాస్ హీరో రవితేజ అంటూ పోస్ట్ చేశారు”.. అంతేకాకుండా మీరు ఎంత హ్యాపీస్ట్ పర్సన్ అన్నయ్య అంటూ రవితేజ చెప్పిన కొన్ని విషయాలను ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారన్న విషయం నేటిజన్స్ కు మాత్రం ఇంకా అర్థం కావడం లేదు.. కానీ పలువురు నెటిజెన్స్ మాత్రం తగలాల్సిన వారికి తగిలింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Harish Shankar: Those words are meant for them.. The tweet is viral..!

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు