Ravi Teja Harish Shankar Movie: హరీష్ అన్నా… మాకు రీమేకులా.. మేకులు వద్దు

హరీష్ శంకర్… పేరు చెప్పిన వెంటనే మళ్లీ ఏ సినిమాను తీసుకొచ్చి తెలుగులో రీమేక్ చేస్తున్నాడు అని అంటారు ఆడియన్స్. హరీష్ శంకర్ నుంచి ఇప్పటి వరకు వచ్చి హిట్ అయిన సినిమాలు అన్నీ కూడా రీమేక్ సినిమాలే. షాక్ సినిమాతో డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చినా.. ఆయనకు ఫస్ట్ హిట్ మాత్రం గబ్బర్ సింగ్. ఈ మూవీ బాలీవుడ్ లో వచ్చిన దబాంగ్ మూవీకి రీమేక్ అని తెలిసిందే. ఇటీవల గద్దలకొండ గణేష్ అనే మూవీకి కూడా హిట్ అయింది. అది కూడా తమిళంలో వచ్చిన జిగర్తాండ అనే మూవీకి రీమేక్.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ చేస్తున్నాడు. ఇది తమిళంలో విజయ్ దళపతి హీరోగా వచ్చిన తేరి సినిమాకు రీమేక్. ఇలా హరీష్ శంకర్ చేసిన సినిమాల్లో ఎక్కువగా రీమేక్‌లే ఉండటంతో రీమేక్ రాజా అని కూడా పిలుస్తారు. అయితే హరీష్ శంకర్ లో ఉన్న పాజిటివ్ ఏంటంటే… రీమేక్ చేసినా, అది ఫ్యాన్స్ కి నచ్చేలా ఉంటుంది. ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటుంది. అందుకే రీమేక్ లు అని తెలిసినా, హరీష్ శంకర్ పై నమ్మకంతో హీరోలు సినిమాలు చేయాడానికి ముందుకు వస్తుంటారు.

ఇలా ఇప్పుడు మాస్ మాహారాజా రవితేజ కూడా ముందుకు వచ్చాడు. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తుందని గత కొన్ని రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. గతంలో ఈ కాంబోలో షాక్, మిరపకాయ్ వచ్చిన సంగతి తెలిసిందే. షాక్ మూవీ షాక్ ఇచ్చినా, మిరపకాయ్ మాత్రం మంచి హిట్ ఇచ్చింది. షాక్, మిరపకాయ్ సినిమాలు రీమేక్ లు కాదు. కానీ, ఇప్పుడు రాబోతున్న మూవీ బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమాకు రీమేక్ అని టాక్ వస్తుంది. ఈ విషయంలో మాస్ మహారాజా ఫ్యాన్స్ భయపడుతున్నారు.

- Advertisement -

అయితే గత కొన్ని రోజుల నుంచి టాలవుడ్ లో రీమేక్ లు కలిసి రావడం లేదు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో వచ్చిన రీమేక్ సినిమాలన్నీ కూడా చేదు ఫలితాలే ఇచ్చాయి. ఇప్పుడు రవితేజ కొత్త మూవీ కూడా రీమేక్ అంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. రీమేక్ లా మేకులు తమకు దింపొద్దు అంటూ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Ravi Teja Harish Shankar Movie.. the director is remaking it again

కాగా, రవితేజ, హరీష్ శంకర్ మూవీలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్స్ ని ఎంపిక చేశారు. దీనిపై ఇటీవలే ఆధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. మాస్ మాహారాజాకి క్లాస్ మహారాణి అంటూ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు