Bigg Boss 7: ఫస్ట్ ఫైనలిస్ట్.. ఫస్ట్ ఎలిమినేట్.. ట్విస్ట్ ఊహించలేదుగా..!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడు ఫైనల్ కి చేరుకుంది. ఇక రేపటితో ఈ షో ముగియబోతోంది. ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తీయబోతున్నారు ప్రస్తుతం హౌస్ లో అమర్ దీప్ , ప్రశాంత్, శివాజీ, యావర్ ,ప్రియాంక , అర్జున్ లు ఉండగా గ్రాండ్ ఫినాలే కి షూటింగ్ శనివారం ఉదయమే ప్రారంభమైంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ను చాలా పక్కా ప్రణాళికతో భారీ ఏర్పాట్లు చేయడం గమనార్హం. నిజానికి ప్రతి సీజన్లో కూడా ఫినాలే ఎపిసోడ్ నాటికి విన్నర్ ఎవరో తేలిపోయేది. అయితే ఇప్పుడు ఉల్టా ఫుల్టా సీజన్ పేరుకు తగ్గట్టుగానే అసలు ఈ విన్నర్ ఎవరు అన్నదానిపై అంచనాలు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే విన్నర్ రేసులో ప్రతిసారి ఇద్దరి మధ్య మాత్రమే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఈ సీజన్లో ముగ్గురు మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. మొత్తం ఆరుగురు ఫైనలిస్టులు ఉన్నప్పటికీ ప్రశాంత్, అమర్, శివాజీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది.

ఈ ముగ్గురిలో ఎవరు విన్నర్ అవుతారు అనేది ఫినాలే ఎపిసోడ్లో నాగార్జున చెప్పేవరకు సస్పెన్సే అని చెప్పవచ్చు. ఇకపోతే అంబటి అర్జున్ తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు అనేది లేటెస్ట్ అప్డేట్.. శనివారం ఉదయం షూటింగ్ ప్రారంభం కాగా టాప్ 6 కంటెస్టెంట్ లో లీస్ట్ 3 కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. అందులో భాగంగానే మొదటిసారిగా అంబటి అర్జున్ ని ఆరో స్థానంలో ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. అర్జున్ తోపాటు ప్రియాంక ఐదో స్థానం.. యావర్ నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది.

ఇకపోతే అర్జున్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఐదో వారంలో వెళ్లడమే అతనికి మైనస్ అయింది. ఒకవేళ అదే ముందు నుంచి వెళ్లి ఉండి ఉంటే అతని గ్రాఫ్ కూడా అమాంతం పెరిగిపోయేది. ఇక ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అతను ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఫినాలే అస్త్రా గెలిచాడు కాబట్టి హౌస్ లో ఉన్నాడు.. లేదంటే లీస్ట్ ఓటింగ్ వచ్చిందని.. స్వయంగా నాగార్జున చెప్పడం కూడా అర్జున్ కి మైనస్ అయింది. ఇక ఓట్లు ఎలాగో పడడం లేదని అతనికి లీస్ట్ ఓటింగ్ పడుతున్నాయనే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించడంతో ఇక పడాల్సిన ఓట్లు కూడా పడకుండా పోయాయి ఇక అలా మొదటి ఫినాలే అస్త్రాను గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా అర్జున్ అంబటి నిలిచి.. చివరిగా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచారు అర్జున్.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు