Guntur Karam: త్రివిక్రమ్ స్టేట్మెంట్ త్రివిక్రమ్ సినిమాకే

Guntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంటుంది. ఇకపోతే ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోయినా ఇప్పటికీ టీవీలో వస్తున్న ప్రతిసారి మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చాలామంది అంచనాలు వేశారు. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

అల వైకుంఠపురం లో సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రావడం. అది కూడా పండగ సీజన్లో రావడం వలన ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ ఊహించారు. కానీ ఈ సినిమా మొదటి షో నుండే మిశ్రమ స్పందనను అందుకుంది. మామూలుగా త్రివిక్రమ్ సినిమా అంటే అందరూ ఇష్టపడేది త్రివిక్రమ్ డైలాగ్స్, త్రివిక్రమ్ చూపించే ఫ్యామిలీ ఎమోషన్స్, వీటికి కనెక్ట్ అవుతారు కానీ ఈ సినిమాకి సంబంధించి గుర్తు పెట్టుకునే అంతగా త్రివిక్రమ్ డైలాగ్స్ ఏవి కనిపించవు.

అయితే మహేష్ బాబు మాత్రం ఈ సినిమాని గట్టు ఎక్కించాడు అని చెప్పొచ్చు. మహేష్ పర్ఫామెన్స్, మహేష్ టైమింగ్, డాన్సులు ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయి సినిమాను ముందుకు నడిపిస్తున్నాయి. దర్శకుడు యొక్క కథను నమ్మి తర్వాత సినిమా కోసం ఏమైనా చేయడం మహేష్ బాబుకి అలవాటు. ఈ సినిమా కూడా అలానే మహేష్ చాలా కష్టపడ్డాడు. దాదాపు 16 ఏళ్ల తర్వాత స్మోకింగ్ కూడా ఈ సినిమాలో మొదలుపెట్టాడు.

- Advertisement -

అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా కూడా మహేష్ ఫెయిల్ అవ్వలేదు. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ చెబుతూ వస్తాడు. మహేష్ చేసిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా కూడా మహేష్ అక్కడ ఫెయిల్ అవ్వడు ఆయన కొత్తగా చేశాడు అంటూ ప్రశంసలు వస్తాయంటూ త్రివిక్రమ్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. యాదృచ్ఛికంగా ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా అది వర్తిస్తుందని చెప్పొచ్చు. సినిమా త్రివిక్రమ్ స్థాయిలో లేకపోయినా కూడా మహేష్ బాగా చేశాడు ఫ్యాన్స్ కి ఇవ్వాల్సిన కిక్ మహేష్ ఇచ్చేశాడు అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు