Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ కి నోటీసులు పంపిన ఈడీ.. రూ.100 కోట్ల స్కాం..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతలు ఘడించిన నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటుడి గా దేశవ్యాప్తంగా మంచి పేరు దక్కించుకున్న ప్రకాష్ రాజ్ అటు కామెడీ చేయడానికి అయినా ఇటు విలన్ గా విధ్వంసం సృష్టించడానికి అయినా సిద్ధం అంటూ తనలోని నటనను కనపరుస్తూ ఉంటారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సమాజంలో అనేక అంశాలపై ప్రభుత్వాలను తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్.. ఈ క్రమంలోనే కొన్ని ఘటనలకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో ఆయన చాలాసార్లు వైరం పెట్టుకోవడం జరిగింది. దీంతో బిజెపి నాయకులు కూడా ప్రకాష్ రాజ్ పై అనేక రకాల విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ డి పోంజీ పథకం కేసులో ప్రకాష్ రాజ్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది.

అయితే ఇలా ఉన్నట్టుండి నోటీసులు పంపించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికొస్తే.. తమిళనాడు తిరుచునాపల్లికి చెందిన ప్రణబ్ జువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకాష్ రాజ్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సంస్థ పోంజీ పథకం ద్వారా ప్రజల వద్ద నుండి సుమారుగా రూ.100 కోట్లు వసూలు చేయడం జరిగిందట. అయితే ఆ తర్వాత అక్టోబర్ నెలలో బోర్డు తిప్పేయడంతో ప్రణబ్ జువెలర్స్ నమ్మించి మోసం చేసిందని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. దీంతో ఓనర్ మదన్ పై కేసు నమోదు చేశారు.

అలాగే పరిస్థితి ఇలాగే ఉంటే తమిళనాడు పోలీసుల ఆర్థిక నేరాల విభాగానికి చెందిన ఎఫ్ఐఆర్ ఆధారం చేసుకొని ఈడి చర్యలకు దిగింది.ఇక 100 కోట్ల మేర మోసం జరిగిందని గుర్తించిన ఈ డి కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలని బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ప్రకాష్ రాజ్ కి కూడా నోటీసులు పంపించడం జరిగింది. వచ్చేవారం చెన్నై లోని ఎదుట ప్రకాష్ రాజ్ హాజరు కావాలని ఆదేశాలలో స్పష్టం చేయడం గమనార్హం ప్రజల సొమ్మును ఇలాంటి కొన్ని సంస్థలు దోచుకుంటూ వారికి అన్యాయం చేస్తున్నాయని చెప్పాలి.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు