Vijay Devarakonda: విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరోలు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఈ జనరేషన్ లో మంచి హీరోగా ఎదుగుతున్న వాళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ దేవరకొండ క్రేజ్ చూస్తే పెద్ద హీరోలకు కునుకు లేకుండా పోతోంది. చాలామంది పెద్ద హీరోలు సైతం ఓపెన్ గానే ఈ మాటలను చెప్పేశారు. పెళ్లిచూపులు సినిమా కంటే ముందు రెండు మూడు సినిమాలు చేసిన విజయ్ దేవరకొండకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఒక్క పెళ్లి చూపులు సినిమా విజయ్ ని క్లాసిక్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేశాడు విజయ్.

ఈయన చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ అగ్ర హీరో రేంజ్ లో గుర్తింపు వచ్చింది. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే చిన్న లాజిక్ ని మిస్ అయ్యారు విజయ్. లైగర్ మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విజయ్ కొన్ని కామెంట్లు చేశాడు. నా అయ్యా, తాత ఎవరు తెలియకపోయినా.. ఈ ఫాలోయింగ్ ఏంటని అన్నాడు. బహుశా ఇది పెద్ద హీరోలకు మింగుడు పడడం లేదు. అంటే తాము తమ తండ్రి, తాతల పేర్లు చెప్పుకొని పైకి వచ్చామా..? అనే భావనలో వారు ఉండొచ్చు. వారిలోని ఈ ఆగ్రహాన్ని వారి ఫ్యాన్స్ బయటపెట్టేశారు.

దీంతో చాలామంది పెద్ద హీరోల ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్ ని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. విజయ్ సినిమా మొదలుపెట్టగానే ఫ్లాప్ అంటూ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. విజయ్ ఎదిగితే వేరే హీరోలకి సమస్య అవుతుందనే ఉద్దేశంతో అతన్ని ఎదగకుండా చేస్తున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది. కానీ ఎవరు ఎంత తొక్కాలని చూసినా పూర్తిగా తొక్కడం అనేది సాధ్యం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండని ఎవరు తోక్కాల్సిన పనిలేదని.. ఆయన చేసే కామెంట్స్ ఏ వీటికి కారణమని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు