Manchu Lakshmi: ఆ హీరో వల్లే ముంబై కి మకాం మార్చిన మంచు లక్ష్మీ.. పెద్ద కథే..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ కుటుంబం నుంచి వచ్చిన మోహన్ బాబు తన వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తన కొడుకులిద్దరూ మంచు విష్ణు , మంచు మనోజ్ సినిమాల పరంగా బిజీగా ఉండగా.. వారి కూతురు మంచు లక్ష్మి కూడా అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె హైదరాబాద్ ను విడిచి ముంబైకి మకాం మార్చింది అని.. అందులోను ఆ స్టార్ హీరోకి భయపడే అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవానికి తెలుగు సినిమా స్థాయి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇతర భాషా నటీనటులు హైదరాబాదులో ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తెలుగు నటి మంచు లక్ష్మీ మాత్రం అందుకు భిన్నంగా ముంబైకి మకాం మార్చింది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఇలా ఉన్నట్టుండి హైదరాబాద్ విడిచి ముంబై వెళ్లడానికి గల కారణం ఆమె సోదరుడు మంచు మనోజ్ తో పాటు రానా దగ్గుబాటి అని తెలుస్తోంది. ఇకపోతే ముంబైకి మకాం మార్చడం పై తాజాగా హిందీ మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. హైదరాబాదులో నాతోపాటు నా తమ్ముడు కూడా ఉండేవారు. అయితే తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో ఒంటరి అయ్యాననే భావన కలుగుతోంది.
ఇదే సమయంలో నా స్నేహితుడు రానాకి ఫోన్ చేస్తే తన కెరీర్ గురించి , బిజినెస్ గురించి సీరియస్ గా మాట్లాడుతున్నాడు.. దాంతో భయమేసింది.. నేనేంటి.. ఎక్కడున్నాను అని నన్ను నేను ప్రశ్నించుకొని.. హైదరాబాద్ విడిచి వెళ్లే సమయం వచ్చిందని డిసైడ్ అయ్యాను.. అందుకే అలా ముంబైకి వచ్చాను. ఇక ఎప్పుడూ ఒకే చోటే ఉంటే కచ్చితంగా బోర్ కొడుతుంది. అక్కడంటే అందరికీ నేను తెలుసు.. కానీ ఇక్కడ నన్ను నేను పరిచయం చేసుకోవాలి.. అందుకే నా కెరియర్ను మొదటి నుంచి ఫ్రెష్ గా మొదలు పెట్టాలనుకుంటున్నాను.
 ఇక ముంబైలో ఇల్లు దొరకడం చాలా కష్టం.. నా ఫ్రెండ్ రకుల్ వల్లే ఇక్కడ నా పని మరింత ఈజీ అయ్యింది. అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా కెరియర్ పై దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ సక్సెస్ అవ్వాలని మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు