Animal : ఇదేం పిచ్చి? మెషీన్ గన్ ఎంత పెద్దదైతే మూవీ అంతపెద్ద హిట్టా?

యానిమల్’తో సందీప్ రెడ్డి వంగా స్టైల్ వయోలెన్స్ ను తెరపై చూడడానికి ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. గురువారం రిలీజైన ‘యానిమల్’ మూవీ ట్రైలర్ వైరల్ అవుతోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగగా, చివర్లో హీరో పట్టుకున్న మెషిన్ గన్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇదేం పిచ్చి? మెషీన్ గన్ ఎంత పెద్దదైతే మూవీ అంతపెద్ద హిట్టా? అని అంటున్నారు. మరి ఈ పిచ్చికి రీజన్ ఏంటి అంటే?

వెండితెరపై సెంటిమెంట్లను మేకర్స్ చాలా సీరియస్‌గా ఫాలో అవుతూ వస్తున్నారు. ఏదైనా ఒక సినిమాలో ఒక కొత్త సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది అంటే మూవీ మేకర్స్ అందరూ తమ నెక్స్ట్ సినిమాలకు అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. అలాంటి ఓ  ఇంట్రెస్టింగ్ ట్రెండ్ మెషిన్ గన్ ను వాడడం ప్రస్తుతం వెండితెరను శాసిస్తోంది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఇదే కొత్త ట్రెండ్. హీరోయిజాన్ని మరింతగా ఎలివేట్ చేస్తోంది. సినిమాలో ఎంత పెద్ద మెషిన్ గన్‌ వాడితే, ఆ మూవీ బాక్సాఫీస్ ఆఫీస్ ను అంతగా షేక్ చేస్తోంది. అందుకే మేకర్స్ ఈ సెంటిమెంట్ ను చాలా సీరియస్ గా, గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. రీసెంట్ గా వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకు నిదర్శనం .

గతంలో ఎన్నో సినిమాలో గన్స్ వాడినప్పటికీ తమిళ హీరో కార్తీ “ఖైదీ” మూవీ నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఈ మూవీ కార్తీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అన్న విషయం తెలిసిందే. “కేజీఎఫ్” మూవీలో ప్రేక్షకులకు పూనకాలు రావడానికి రాఖీ భాయ్ మెషీన్ గన్స్ తో చేసిన వయోలెన్స్, రీసౌండ్ కూడా ఒక రీజన్. ఇక ఆ తరువాత కమల్ హాసన్ “విక్రమ్” క్లైమాక్స్ లో వాడగా, మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య”లో, విశాల్ “మార్క్ ఆంటోనీ”లో ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ సూపర్ హిట్లు అందుకున్నారు. ఇక ‘దసరా’ బ్లాక్ బస్టర్ “భగవంత్ కేసరి”లో కూడా ఈ సెంటిమెంట్ పై సెటైర్లు వేశారు. ఓ సన్నివేశంలో బాబు ఈ మెషిన్ గన్ వాడినోళ్లు అందరూ హిట్ కొడుతున్నారు అని చెప్పగా, లేదు మనకు ఆ మెషిన్ గన్ కాదు అంటూ బాలయ్య సిలిండర్లు పేల్చేయడం థియేటర్లలో చూసే ఉంటారు. ,

- Advertisement -

సందీప్ ‘యానిమల్’లో కూడా ఇలాంటిదే ఓ భారీ మెషీన్ గన్ ఉండడం విశేషం. సినీ ప్రియులను ఉర్రూతలూగించడానికి, ‘యానిమల్’ వయోలెన్స్ ను మరింత భయకంరంగా చూపించడానికి ఈ మెషీన్ గన్ హెల్ప్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు