Sam – Chaithu: చైతూ బర్త్ డే.. సర్ప్రైజ్ చేసిన సమంత..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ క్రేజీ బ్యూటిఫుల్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో సమంత – నాగచైతన్య జోడి కూడా ఒకటి. అప్పట్లో ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల వీరిద్దరి విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు ఇద్దరిపై విమర్శలు గుప్పిస్తున్నారు నేటిజెన్లు. అయితే ఇప్పటికీ కూడా ఈ జంటకు అభిమానులు ఉన్నారనటంలో సందేహం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై అక్కడి నుంచే వీరి ప్రేమాయణం కూడా మొదలయ్యింది. ఆ తర్వాత నాగార్జునను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వీరు అనుకోకుండా విడిపోయి ప్రస్తుతం ఎవరి కెరియర్ పరంగా వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోని నవంబర్ 23న అంటే ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు కావడంతో సమంత తన మాజీ భర్తకు ఒక గిఫ్ట్ పంపించినట్లు ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇక ఇంతకు ఆ గిఫ్ట్ ఏమిటి ? అనే విషయానికి వస్తే.. పెళ్లయిన కొత్తలో నాగచైతన్య..

సమంత కోసం ప్రత్యేకంగా ఒక బ్రేస్ లెట్ చేయించి ఇచ్చారట. విడిపోయిన తర్వాత ఇద్దరికీ సంబంధించిన వస్తువులను, ఆస్తులను వెనక్కి ఇచ్చేసుకున్నారు. కానీ సమంత తన వద్ద ఉన్న చైతన్య బ్రేస్ లెట్ ను మాత్రం వెనక్కు ఇవ్వలేదట.

- Advertisement -

అందుకే ఇప్పుడు నాగచైతన్యకు వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఆమె తన పుట్టినరోజు సందర్భంగా ఆ బ్రేస్ లెట్ ను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి నాగచైతన్య ఇంటికి కొరియర్ చేసినట్లు సమాచారం.

ఇకపోతే సమంత పంపించిన ఈ గిఫ్ట్ ని చూసి నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ బహుమతిని చూసి సమంత గిఫ్ట్ పంపించింది అని ఆనందపడాలో.. లేక తనకు సంబంధించిన ఏకైక గుర్తును కూడా వెనక్కి పంపించింది అని ఫీల్ అవ్వాలో తెలియక సన్నిహితులకు చెప్పుకొని నాగచైతన్య బాధపడినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త కాస్త నెట్ ఉంటే చాలా వైరల్ గా మారుతుంది.

ఒకవేళ ఇదే నిజమైతే ఇక జీవితంలో వీరిద్దరూ కలిసి అవకాశమే లేదని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం థండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. సమంత మాత్రం తనకు వచ్చిన మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు