Dhruva nakshatram: ప్రేక్షకుడికి యావజ్జీవం తప్పదా?

ఈ వారం థియేటర్లలో మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా, వాటిలో ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన సినిమా “ధృవ నక్షత్రం”. ఈ సినిమా గురించి కామన్ ఆడియన్స్ కన్నా, మూవీ లవర్స్, ముఖ్యంగా చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోరు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో సినిమాకి ఈ పరిస్థితి వచ్చి ఉండదు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2016 లో రిలీజ్ కావల్సి ఉంది. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఎల్లా తరబడి వాయిదా పడుతూ వస్తుంది.

ఇప్పటికే ఎన్నో సార్లు రిలీజ్ డేట్ ప్రకటించి మరీ వాయిదా వేశారు. అయితే ఇన్నాళ్ళకి సినిమాని రిలీజ్ కంఫర్మ్ అని నెలరోజుల నుండి ఫ్యాన్స్ ని ఊరించి, ట్రైలర్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా రిలీజ్ చేసి, తీరా రిలీజ్ డేట్ వచ్చే సరికి మళ్ళీ వాయిదా వేశారు.

తాజాగా గౌతమ్ మీనన్ తన ట్విట్టర్ పేజీలో “సారీ సినిమాని రిలీజ్ చేద్దామని చాలా ట్రై చేసాం, కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా వేసాం”, అంటూ స్మూత్ గా ఠాగూర్ సినిమాలో డాక్టర్ చెప్పినట్టు చెప్పి తప్పించుకున్నారు. కొన్ని రోజుల్లో కొత్త అప్డేట్ తో ముందు కు వస్తామని చెప్పాడు గౌతమ్ మీనన్. ఈ ట్వీట్ చూసిన విక్రమ్ ఫ్యాన్స్, ఇంకా కామన్ ఆడియన్స్ ఆ పోస్ట్ కింద నానా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

కనీసం ఎప్పుడొస్తుందో కూడా క్లారిటీ ఇవ్వకుండా ఇదేం అన్యాయం అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి కొందరు ఈ సినిమా గురించి మర్చిపోండని ఒక రకమైన ట్రోల్ చేస్తున్నారు. ఓవరాల్ గా ధృవ నక్షత్రానికి మాత్రం ఈ వాయిదాల పర్వం తప్పలేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు