Ajaybhupathi: “మంగళవారం” ఫస్ట్ వీక్ లెక్క… దెబ్బ పడింది అక్కడే?

టాలీవుడ్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో మంగళవారం ఒకటి. ఈ సినిమా రిలీజ్ సినిమాల్లో ఎక్కువ అంచనాలతో రిలీజ్ కాగా, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా ఇదొక్కటే. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పాయల్ రాజపుత్ మెయిన్ లీడ్ గా నటించడం జరిగింది. సస్పెన్స్ థ్రిలర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల సినిమాకి ఏ సెర్టిఫికెట్ రావడం జరిగింది. అందువల్ల మంగళవారం సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కొంత వరకు ఎఫెక్ట్ పడింది.

అయినా ఫస్ట్ వీక్ ఈ సినిమా బాగానే వసూలు చేసింది. ఇక రిలీజ్ అయిన వరం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నైజాం లో 3.19 కోట్లు, ఆంధ్ర 2.90కోట్లు, సీడెడ్ 1.10కోట్లు కలిపి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 7.17 కోట్ల షేర్ రాబట్టగా, వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ కలుపుకొని మరో కోటి రూపాయలు అదనంగా వసూలు చేసింది. ఓవరాల్ గా మంగళవారం సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గా 8.19 కోట్ల షేర్ 15 కోట్ల గ్రాస్ రాబట్టింది.

అయితే 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన మంగళవారం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 4.81 కోట్లు కలెక్ట్ చేయాలి. అయితే మంగళవారం సినిమాకి లో ఎక్కువ వైలెన్స్ ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బేస్తే, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరో దెబ్బేసింది. ఇక రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా బాగానే థియేటర్లు గుప్పెట్లో పెట్టుకుంది. మరి లాంగ్ రన్ లో మంగళవారం ఎంతవరకు వసూళ్లు రాబడుతుందో, బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు