Aadikeshava : శ్రీలీల దానికే పరిమితమా? డైరెక్టర్స్ కి మైండ్ దొబ్బిందా ఏంటి?

శ్రీలీల… ఈ పేరు చెబితే చాలు సౌత్ లో ఉన్న చాలా మంది సినీ ప్రియులకు పూనకాలే. మోస్ట్ వాంటెడ్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలేస్తున్న శ్రీలీల “పెళ్లి సందడి” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు కొల్లగొట్టేసింది. ఈ బ్యూటీ డ్యాన్స్ చూస్తే రాళ్ళకు కూడా ఊపు వస్తుంది. అందం, అభినయం పాళ్లు కూడా ఈ అమ్మాయిలో కాస్త ఎక్కువేనని చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో “గుంటూరు కారం”, “ఉస్తాద్ భగత్ సింగ్” వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా శ్రీలీల “ఆదికేశవ” అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చింది. వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీకి శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్. ఈ ఫ్రైడే థియేటర్లోకి దిగిన “ఆదికేశవ” మూవీ ఫస్ట్ డే నే నెగిటివ్ టాక్ తో డీలా పడింది. శ్రీలీల గ్రేస్ కూడా ఈ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు.

అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేదన్నది టాక్. కేవలం ఆమెను డ్యాన్సింగ్ టాయ్ గానే పరిగణిస్తూ ఈ మూవీకి సెలెక్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు శ్రీలీల ఫాన్స్ అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. టాలీవుడ్ డైరెక్టర్స్ కు మైండ్ దొబ్బిందా? ఇండస్ట్రీ శ్రీలీల వంటి అద్భుతమైన నటిని వాడుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతోంది?

శ్రీలీల డ్యాన్స్ ఎలాగూ ఇరగదీస్తుంది. అది సినిమాకు తప్పకుండా ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే ఆమెకు యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. డైరెక్టర్స్ శ్రీలీలలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ను ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఆమె డ్యాన్స్ చేయడానికి, గ్లామర్ ఒలకబోయడానికి తప్ప యాక్టింగ్ కి పనికిరాదు అనుకుంటున్నారా? లేకపోతే శ్రీలీలకే కథను ఎంచుకోవడం తెలియట్లేదా? ఆమె చేస్తున్న సినిమాలన్నీ కూడా అలాగే ఉన్నాయి.

- Advertisement -

“ధమాకా” హిట్ అయినప్పటికీ ఆ సినిమాలో ఆమెకు పెద్దగా నటించే స్కోప్ లేదు. అలాగే రీసెంట్ గా వచ్చిన “స్కంద”.. ఆ మూవీ కూడా శ్రీలీల ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చింది. ఇక బాలయ్యతో “భగవంత్ కేసరి”లో డి-గ్లామర్ రోల్ లో అందరినీ ఆకట్టుకుంది. తాజా మూవీ “ఆదికేశవ”లో ఆమె పాత్రకసలు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక నెక్స్ట్ రానున్న “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమాలో కూడా శ్రీలీల కేవలం గ్లామర్ డాల్ గానే కన్పిస్తుందేమో? మరి ‘భగవంత్ కేసరి” సినిమాతో నటిగా తానేంటో నిరూపించుకున్న శ్రీలీలకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లోనైనా నటించే అవకాశం దక్కుతుందేమో చూడాలి. ఆ సినిమాల్లో కూడా ఇలాగే ఉంటే శ్రీలీల కేవలం గ్లామర్ డాల్ గా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ బ్యూటీ ఇప్పటికైనా మంచి నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవాలని కోరుకుందాం.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు