Aadikeshava : ఇలాగైతే మూటాముల్లె సర్దేసుకో వైష్ణవ్.. త్వరలోనే షెడ్డుకెళ్ళిపోవడం ఖాయం

మెగా కాంపౌండ్ నుంచి అడుగుపెట్టిన హీరోల్లో వైష్ణవ తేజ్ ఒకరు. ఈ యంగ్ హీరో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు గడిచిపోతున్న ఇంకా ఆయన పేరు చెబితే ఫస్ట్ మూవీ “ఉప్పెన”నే గుర్తొస్తుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వైష్ణవ్ ఆ తర్వాత కథలను ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు.

“ఉప్పెన” తర్వాత వైష్ణవ తేజ్ “కొండపొలం”, “రంగ రంగ వైభవంగా” అనే సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. తాజాగా ఈ హీరో “ఆదికేశవ” అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా కూడా నెగిటివ్ టాక్ తో వైష్ణవ్ కు మరో డిజాస్టర్ గా నిలిచింది. మెగా ఫ్యాన్స్ కూడా హర్షించని విధంగా ఈ మూవీ ఉందంటూ ట్రోల్స్ నడుస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే వైష్ణవ తేజ్ వన్ టైం వండర్ గా మిగిలిపోయేలా ఉన్నాడు అన్పిస్తోంది. ఆ ఫస్ట్ మూవీ కూడా మెగాస్టార్ చిరంజీవి సెలెక్ట్ చేయడం వల్ల, సుకుమార్ ప్రమేయం ఉండడం వల్ల, మెగా కాంపౌండ్ నుంచి గట్టి సపోర్ట్ లభించడం వల్ల హిట్ అయింది.

- Advertisement -

ఇక సినిమాల్లోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఈ యంగ్ హీరో నేర్చుకున్నది ఏమిటో మెగా ఫాన్స్ కి అంతు పట్టడం లేదు. “ఆదికేశవ” కథను అసలు ఎలా ఎంచుకున్నాడు? ఇలాంటి మరో రెండు సినిమాలు చేస్తే చాలు వైష్ణవ తేజ్ ముటాముల్లె సర్దేసుకొని షెడ్డు కు వెళ్లిపోవడం వెళ్లిపోవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ కాదు సరైన కంటెంట్ ను ఎంచుకోవడం ముఖ్యం బిగిలు అంటున్నారు.

అయితే ఇతను ఇంకా అప్కమింగ్ హీరో కాబట్టి ఇలా తలకు మించిన భారాన్ని నెత్తినెత్తుకున్నాడు అనడంలో అర్థం ఉంది. కానీ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న నాగవంశీ ఈ కథను ఎలా సెలెక్ట్ చేశాడు? అనే ప్రశ్న తలెత్తుతోంది. అందుకే కాబోలు నాగవంశీ ఈ సినిమా ప్రమోషన్ టైంలో రివ్యూలు కొంచెం లేటుగా ఇవ్వండి అంటూ సినీ జర్నలిస్టులను కోరారు. ప్రస్తుతం అదే వీడియోను వైరల్ చేస్తూ ఈ సినిమా రిజల్ట్ ఏంటో ముందే తెలిసిపోయింది కాబట్టే నాగ వంశీ అలా అడిగారని అంటున్నారు. ఏదేమైనా బ్యాగ్రౌండ్ ఉంది కదా… ఎలాంటి సినిమా తీసినా చూస్తారు అని లైట్ తీసుకోకుండా ఇప్పటికైనా ఈ మెగా కాంపౌండ్ హీరో కళ్ళు తెరిస్తే బాగుంటుంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు