Vaishnav Tej: నాగవంశీ నమ్మకాన్ని వైష్ణవ్ తేజ్ నిలబెడతారా..?

మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ఆది కేశవ.. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ.. మాస్ అండ్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ట్రైలర్ తో సాలిడ్ అంచనాలను కూడా నెలకొల్పింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ కాగా రన్ టైంను కూడా ఫిక్స్ చేశారు. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రానికి 129 నిమిషాల నిడివిని లాక్ చేయడం జరిగింది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఇకపోతే జోజు జార్జ్ , అపర్ణ దాస్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా నవంబర్ 24న అంటే రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అటు దర్శకుడు, ఇటు నిర్మాతలు అందరూ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాను సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాదులో ఉండే ఒక సాధారణ కుర్రాడు ఎక్కడో అనంతపురం దగ్గరున్న కళ్యాణ్ దుర్గం లోని బ్రహ్మాసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు? అనేది ఈ సినిమాలో చూపిస్తారు.

ఇకపోతే ఈ సినిమా కథను నిర్మాత నాగవంశీకి డైరెక్టర్ వినిపించినప్పుడు ఇంత బడ్జెట్లోనే సినిమా తీయాలని తనకు చెప్పలేదట . కొత్త దర్శకుడు నువ్వు.. నీకు డబ్బుల గురించి ఆలోచన వద్దు.. సినిమా కోసం అడిగినవన్నీ సమకూరుస్తాను అని చెప్పి బడ్జెట్, పారితోషకం విషయంలో ఏమాత్రం ఆలోచించలేదని డైరెక్టర్ వెల్లడించారు. ఇకపోతే నాగవంశీ ఈ సినిమా కోసం ఏకంగా 35 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టారు. ఒకరకంగా చెప్పాలి అంటే వైష్ణవ్ తేజ్ మార్కెట్ కి ఇది రెట్టింపు అని చెప్పవచ్చు.

- Advertisement -

ఇకపోతే బడ్జెట్ గురించి ఆలోచించకుండా డైరెక్టర్ పై నమ్మకంతో వైష్ణవ్ తేజ్ నటనను దృష్టిలో పెట్టుకొని నిర్మాత నాగ వంశీ ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ కేటాయించారు. ఇకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ కావడానికి గల కారణం ఏమిటి అంటే .. షూటింగ్ డిలే అవ్వడం, రిలీజ్ డేట్ వాయిదా పడటంతో… వడ్డీల రూపంలో అంత మొత్తం అయ్యింది. వీరిపైన నమ్మకంతోనే సినిమా విడుదల డిలే అయినా కూడా నాగ వంశీ భరించినట్లు సమాచారం. మరి నాగవంశీ నమ్మకాన్ని అటు హీరోగా వైష్ణవ్ తేజ్ ఇటు డైరెక్టర్ గా శ్రీకాంత్ రెడ్డి నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు