Kiran abbavaram: పైత్యం బాగా ముదిరింది.. ఇదేం కర్మో కానీ..!

 

ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న ఈయన నటన విషయంలో ఓకే కానీ తాను తెర కెక్కిస్తున్న ఏ ఒక్క సినిమా కూడా ఆయనకు మంచి పేరు తీసుకు రాలేదని చెప్పాలి. రాజా వారు రాణి గారు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమై.. ఈ సినిమాతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు కానీ ఈ సినిమాని థియేటర్లలో మాత్రం ప్రేక్షకుల పెద్దగా చూడలేదని చెప్పాలి. కానీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. దీంతో దాదాపు పది సినిమాల వరకు ఆఫర్లు లభించాయి.

అలా ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోగా.. ఈ సినిమా తర్వాత సమ్మతమే, వినరో భాగ్యం విష్ణు కథ వంటి సినిమాలు చేశారు. అయితే ఈ సినిమాలు కూడా బాగానే వచ్చాయి.. అయితే ఇక్కడ అందరి నుంచి ఒక వినిపించే ఒకటే ఒక కంప్లైంట్ కిరణ్ లుక్స్.. అలాగే పర్ఫామెన్స్.. ఈ రెండు ప్రతి సినిమాలో కూడా కామన్ గా ఉండడంతో సినిమాలు పెద్దగా హిట్ అవడం లేదని చెప్పాలి. అంతేకాదు అన్ని సినిమాలలోనూ సింగిల్ ఎక్స్ప్రెషన్, ఒకే నవ్వుతో దాదాపు ఏడు సినిమాలు చేశాడు. మరోవైపు దాదాపు పది సంవత్సరాల తర్వాత మీటర్ , నేను మీకు బాగా కావాల్సిన వాడిని, రూల్స్ రంజన్ వంటి చిత్రాలు చేశాడు. అయితే ఈ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా వీటిని క్లాసిక్స్ చిత్రాలని చెబుతున్నాడు కిరణ్ అబ్బవరం. వాస్తవానికి తన సినిమా ఫ్లాప్ అయినా సరే ఆయన ఏ రోజు కూడా తన సినిమా ఫ్లాప్ అయినట్టు ఒప్పుకున్న దాఖలాలు లేవు. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇదేం కర్మో కాని ఇతడికి పైత్యం బాగా ముదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

ఇక తాజాగా ఈయన చేసిన చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా తర్వాత తన కొత్త లుక్ రివీల్ చేశాడు కిరణ్ అబ్బవరం. తాజాగా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ లో స్టైలిష్ లుక్ లో చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు. రూల్స్ రంజన్ సినిమా తర్వాత తన టోటల్ మేకోవర్నే మార్చేశారు కిరణ్ అబ్బవరం. మరి ఇకనైనా తన నటనను కనబరిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతాడో లేదో చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు