Adikeshava vs Kotabommali : బాక్స్ ఆఫీస్ కు ఈ ఫ్రైడే కూడా నిరాశ తప్పదా?

సినీ ప్రియులకు నవంబర్ నెల అంతా డల్ గానే గడిచింది. అయితే పరిస్థితులు చూస్తుంటే ఈ ఫ్రైడే కూడా అదే సిచువేషన్ ఎదురయ్యేలా కనిపిస్తోంది. గత నెల “భగవంత్ కేసరి” సినిమా వచ్చినప్పుడే బాక్స్ ఆఫీస్ గట్టిగా షేక్ అయింది. ఇక ఆ తర్వాత ఎన్నో చిన్నాచితక సినిమాలు వచ్చినప్పటికీ అసలు చప్పుడే లేకుండా పోయింది. ఒకవైపు వరల్డ్ కప్ ఫీవర్, మరోవైపు ఎలక్షన్స్ హిట్ బాక్స్ ఆఫీస్ ను దెబ్బతీస్తున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన “మంగళవారం” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త సందడి చేసింది. కానీ ఈ వారం రాబోతున్న రెండు సినిమాలు కూడా చిన్న సినిమాలే. పైగా ఆ రెండు సినిమాలకు అసలు బజ్ లేనేలేదు. ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న రెండు సినిమాలు ఆదికేశవ, కోటబొమ్మాళి.

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం “ఆదికేశవ” ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు “ఆదికేశవ” ఇప్పుడు నవంబర్ 24 న విడుదలకు రెడీగా ఉంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఆదికేశవ’లో హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన కొంత కంటెంట్ రీషూట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇటీవల వచ్చిన టీజర్ , ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ అసలు సినిమాపై బజ్ ను పెంచడంలో ఫెయిల్ అయ్యాయి. ఇప్పటికే పడాల్సిన యూఎస్ ప్రీమియర్లను మూవీ టీం వేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రేపు రాబోయే మరో తెలుగు చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్‘. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్, మురళీ శర్మ ప్రధాన నటించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నాయట్టు’కి రీమేక్. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాపై కూడా పెద్దగా హైప్ లేదు. ఈ రెండు సినిమాను ఓటిటిలో వేసినా ఆడియన్స్ ఆసక్తి చూపించని పరిస్థితి నెలకొంది. అలాంటప్పుడు ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ కు ఊపిరి పోస్తాయి అనుకోవడం కామెడీనే అవుతుంది. ఇదంతా చూస్తుంటే ఈ వీక్ కూడా బాక్స్ ఆఫీస్ కు నిరాశ తప్పేలా కన్పించడం లేదు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు