Kota bommali first Review: కోట బొమ్మాళి ఫస్ట్ రివ్యూ

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ “కోట బొమ్మాళి పీఎస్”. “నాయట్టు” అనే సూపర్ హిట్ మలయాళ మూవీకి రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జోహార్, అర్జున ఫాల్గుణ ఫేమ్ తేజ మార్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

GA2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నవంబర్ 24న థియేటర్లలోకి రానుంది. అయితే తాజాగా మేకర్స్ ఇండస్ట్రీలో ఉన్న కొందరు ప్రముఖులకు “కోట బొమ్మాళి పీఎస్” మూవీ స్పెషల్ షోలు వేశారట. దీంతో సినిమా ఎలా ఉందన్న ఈ మూవీ టాక్ బయటకు వచ్చేసింది. “కోట బొమ్మాళి పీఎస్” ఫస్ట్ రివ్యూ ఎక్స్క్లూజివ్ గా ఫిల్మీఫై రీడర్స్ కోసం…

ఇక “కోట బొమ్మాళి పీఎస్”.మూవీ ఎలా ఉందన్న విషయానికొస్తే… ఒకేమాటలో చెప్పాలి అంటే ఈ మూవీ క్రిటిక్స్ కి నచ్చుతుంది. కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం కష్టం అంటున్నారు. రాజశేఖర్ తనయ నిజానికి శివాని రాజశేఖర్ ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాతోనైనా హీరోయిన్ గా తనకు మంచి గుర్తింపు రావాలని ఆశిస్తోంది.

- Advertisement -

మరోవైపు సినిమాలో ఉన్న తారలు అందరి పరిస్థితి ఇదే. డైరెక్టర్ తేజకు కూడా ఈ మూవీ హిట్ కావడం చాలా ముఖ్యం. ఈ యంగ్ డైరెక్టర్ కు ఇది మూడవ చిత్రం. అర్జున ఫాల్గుణ తరువాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న తేజకు ఈ మూవీ హిట్ అయితేనే నెక్స్ట్ స్టార్స్ కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది. లేదంటే కష్టం.

కాగా ఇది కేవలం ఫస్ట్ రివ్యూ మాత్రమే. సినిమా థియేటర్లలోకి వచ్చాక ఆడియన్స్ ఇచ్చే తీర్పుతో “కోట బొమ్మాళి పీఎస్” ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది తెలుస్తుంది. మరి ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చుతుందా లేదా ? సినీ ప్రియులు ఈ మూవీకి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో తెలియాలంటే నవంబర్ 24 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లోనే రివ్యూలు సినిమాలను చంపేస్తున్నాయంటూ దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి ప్రొడ్యూసర్స్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. మరి ఈ సినిమా విషయంలో రివ్యూలు ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయో చూడాలి.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు