Kota Bommali PS: ఆ ఒక్క పాయింట్ చాలు సినిమా ఫ్లాప్ అవ్వడానికి?

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న “కోట బొమ్మాలి పిఎస్” అనే క్రైమ్ ట్రిల్లర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. నవంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.

“కోట బొమ్మాలి పిఎస్” మూవీ “నాయట్టు” అనే మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. దీంతో ఇప్పటికే “నాయట్టు” మూవీ చూసిన కొంతమంది, దీనికి రీమేక్ గా వస్తున్న “కోట బొమ్మాలి పిఎస్” మూవీలో ఆ ఒక్క పాయింట్ చాలు సినిమా ప్లాప్ అవ్వడానికి అంటూ రిలీజ్ కి ముందే చెప్పేస్తున్నారు.

“నాయట్టు” మూవీ స్టోరీ విషయానికి వస్తే… కేరళలో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ప్రవీణ్ మైఖేల్ అనే పోలీస్ అప్పుడే విధుల్లో చేరుతాడు. అప్పటికే ఏఎస్ఐ మనియన్, కానిస్టేబుల్ గా సునీత అక్కడే పని చేస్తుంటారు. ఓ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడితో ప్రవీణ్, మనియన్లు అనుకోకుండా వాగ్వాదానికి దిగుతారు. ఆ తర్వాత ఓ రోజు ప్రవీణ్, ఏఎస్ఐగా పనిచేస్తున్న మనీ, కానిస్టేబుల్ సునీత ఓ ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుంటారు. అయితే వీళ్ళ వాహనాన్ని నడుపుతున్న ఓ వ్యక్తి మార్గం మధ్యలో యాక్సిడెంట్ చేసి అక్కడ నుంచి పారిపోతాడు.

- Advertisement -

ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన అవతల వ్యక్తి ఇంతకుముందు వీళ్ళు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగిన అతనికి దగ్గర బంధువు అవుతాడు. దీంతో దీనికి రాజకీయరంగు పులిమి ఆ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆందోళనకు దిగుతారు. యాక్సిడెంట్ తో ఏమాత్రం సంబంధంలేని ఈ ముగ్గురినీ ఇరికించేందుకు ప్లాన్ జరుగుతున్నట్టుగా తెలుసుకున్న ఏఏఎస్ఐ మనీ… మిగతా ఇద్దరితో కలిసి పోలీస్ స్టేషన్ నుంచి పరారవుతాడు.

దీంతో సొంత డిపార్ట్మెంట్ వారే ఈ ముగ్గురిని వెంటాడంతో, వారిని పట్టుకోవడానికి పోలీస్ వేట స్టార్ట్ అవుతుంది. తదనంతరం పరిణామాలే సినిమాను హిట్ అయ్యేలా చేశాయి. అయితే ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో కీలక పాత్ర పోషించిన ఏఎస్ఐ మనియన్ చనిపోతాడు. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుండడంతో శ్రీకాంత్ ఇందులో ఏఎస్ఐ మనియన్ పాత్రలో నటిస్తున్నాడు. కాబట్టి అతని పాత్రను చంపేస్తారని టాక్. అయితే సినిమాలో తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితుడైన ఒకే ఒక్క నటుడు శ్రీకాంత్.

శివాని, రాహుల్ పాత్రల కంటే శ్రీకాంత్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా చూసుకుంటే ఈ సినిమాకి శ్రీకాంత్ హీరో. అయితే సినిమా క్లైమాక్స్ లో హీరోను చంపితే తమిళ తమ్ముళ్లు స్వాగతిస్తారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం కట్టగట్టుకుని ఆ సినిమాను రిజెక్ట్ చేస్తారు. గతంలో చాలా సినిమాలకు ఇలాగే జరిగింది. దీంతో ఇప్పుడు “కోటబొమ్మాలి పిఎస్” మూవీ ప్లాఫ్ అవ్వడానికి ఈ ఒక్క అంశం చాలని అంటున్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు