IFFI Goa 2023 : సల్మాన్ కు ఇదేం పిచ్చి… ఎప్పుడూ అదే యావనా ?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సినిమాల కంటే ఎక్కువగా వివాదాస్పద అంశాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకున్న తర్వాత ఈ బాలీవుడ్ స్టార్ ఇటీవల “టైగర్ 3” సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. యావరేజ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. వరల్డ్ కప్ ఫీవర్ ఎఫెక్ట్ సినిమాపై పడినప్పటికీ ప్రస్తుతం మళ్ళీ బాక్సాఫీస్ పుంజుకుంటుంది. మరో వారం పాటు “టైగర్ 3” హవా బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగే అవకాశం కనిపిస్తోంది. దీంతో “టైగర్ 3” బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను రాబట్టుకోవచ్చు. అయితే తాజాగా సల్మాన్ ఒక రిపోర్టర్ ని కిస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

నిజానికి ఎప్పుడు చూసినా సీరియస్ గా ఉండే సల్మాన్ తాజాగా ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చోద్యమంతా IFFI 2023 వేడుకలో జరగడం గమనార్హం. 54వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవం నవంబర్ 28 వరకు కొనసాగుతుంది. “ఫెర్రీ” అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టిన తన మేనకోడలు అలీజా అగ్నిహోత్రితో కలిసి సల్మాన్ ఖాన్ నవంబర్ 21న ఈవెంట్ కి వచ్చారు. నిజానికి అలీజాకు ఇదే మొదటి చిత్రం. ఈ మూవీ తోనే ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

IFFI 2023లో “ఫెర్రీ” మూవీ ప్రీమియర్ సందర్భంగా సల్మాన్ ఖాన్ అక్కడ సందడి చేశారు. ఇక సల్మాన్ ఖాన్ ఈవెంట్ కు చేరుకోగానే, అక్కడ పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. ఆ జనాల్లోనే సడన్ గా ఒకామెను ముద్దు పెట్టుకున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఆమె సీనియర్ జర్నలిస్ట్ అని తెలుస్తోంది. అంతేకాదు ఆమె సల్మాన్ ఖాన్ కు మంచి స్నేహితురాలట. ఇక సల్మాన్ ఖాన్ ఆమెను పలకరిస్తూ సరదాగా ముద్దు పెట్టుకున్నారట. అయితే ఇటీవల “టైగర్ 3” ఈవెంట్లో కూడా సల్మాన్ ఖాన్ ఇలాగే విచిత్రంగా ప్రవర్తించాడు.

- Advertisement -

“టైగర్ 3” లో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ హష్మిపై వేదికపైనే ముద్దుల వర్షం కురిపించాడు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిసింది. ఇక ఆయనను హేట్ చేసేవాళ్లు సల్మాన్ ఖాన్ కొంపదీసి ఆ టైపా ఏంటి అంటూ ట్రోల్ కూడా చేశారు. మొత్తానికి సల్మన్ భాయ్ కి ఈ ముద్దుల పిచ్చి ఏంటో మరి అంటున్నారు నెటిజెన్లు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు