Dhruva Nakshatram: ఏడేళ్ల కిందటి సినిమాకి ఈ రేంజ్ రేటా?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన “ధృవ నక్షత్రం” సినిమా నవంబర్ 24న రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. గౌతమ్ మీనన్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ఎప్పుడో 2016 లో పూర్తయినా, ఫైనాన్షియల్ ఇష్యూ ల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ గ్యాప్ లో విక్రమ్ నటించిన అరడజనుకి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే అసలు రిలీజే కాదనుకున్న ఈ సినిమా ఇన్నాళ్ల తరువాత నవంబర్ 24 న అన్ని అడ్డంకుల్ని దాటుకుని రిలీజ్ అవబోతుంది.

అయితే ధృవ నక్షత్రం సినిమా లేట్ రిలీజ్ అవడం వల్ల విక్రమ్ గత సినిమాల రేంజ్ లో కాకుండా డీసెంట్ బిజినెస్ చేసింది. కానీ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో మెల్లిగా బజ్ పెంచుకుంటూ పోయిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ మాత్రం సాలిడ్ గా దక్కించుకుందని సమాచారం అందింది.

ధృవ నక్షత్రం సినిమాని ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ దాదాపు 40 కోట్లు చెల్లించి ధృవ నక్షత్రం సినిమా హక్కులు తీసుకున్నారని సమాచారం. ఇక ఈ రైట్స్ తో పాటు టీవీ ఛానల్ రైట్స్ ని సన్ టీవీ వాళ్ళు భారీ మొత్తంలో చెల్లించి దక్కించుకున్నారట. ఇక సినిమా ట్రైలర్ కూడా మెప్పించడంతో, ఉన్న బజ్ కి ధృవ నక్షత్రం మంచి రెస్పాన్స్ గనుక దక్కించుకుంటే సినిమా హిట్ అవ్వడం ఎవ్వరూ ఆపలేరు. పైగా పెద్ద సినిమాలు కూడా పోటీగా ఏమి రిలీజ్ అవడం లేదు, కాబట్టి ఈ సినిమాకి అడ్వాంటేజ్ అని చెప్పాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు