Animal: విధ్వంసం సృష్టించిన రణబీర్ కపూర్.. యానిమల్ వైల్డ్ ట్రైలర్ ..!

ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తాజాగా నటిస్తున్న చిత్రం యానిమల్. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ సందీప్ వంగా నుంచి వస్తున్న ఈ సినిమా అండర్ వరల్డ్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాని ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు డైరెక్టర్.. ఇందులో రణబీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ప్రకటించిన రోజు నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తోడు ఈ సినిమాలో అనిల్ కపూర్ , బబ్లూ పృథ్వీ, బాబీ డియోల్ వంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తుండడంతో సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి.

ఇక ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన టి సిరీస్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ ఒకటో తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక సినిమా నిడివి విషయానికి వస్తే.. ముందుగా అనుకున్న రన్ టైమ్ 3:40 గంటలు. రెండు ఇంటర్వల్స్ వేద్దామనుకున్నారట. కానీ తుది నిర్ణయంలో ఒకే ఇంటర్వల్ తో 3 :21 గంటలకి లాక్ చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా మూడు నిమిషాల లాంగ్ నిడివితో రిలీజ్ చేయడం జరిగింది.

ట్రైలర్ మొత్తం ఫాదర్ అండ్ సన్ అనుబంధం చుట్టూనే తిరిగింది. ఎమోషన్ తో పాటు యాక్షన్ తో కలగలిసిన వైల్డ్ ట్రైలర్ అని చెప్పవచ్చు. ఇక ఈ ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం హిందీ యాక్టర్స్ తోనే నిండిపోయినట్లు తెలుస్తోంది. కానీ సౌత్ నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. ఇకపోతే ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని చెప్పవచ్చు. మొన్నటి వరకు పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచేసిన సందీప్ గా ఇప్పుడు ట్రైలర్ తో సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న సందీప్ ఇప్పుడు ఈ మూవీ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారు అన్నది అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఇక ట్రైలర్ తోనే అదరగొట్టిన రణబీర్ కపూర్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు