Adikeshava Movie First Review: ఆదికేశవ మూవీ ఫస్ట్ రివ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం “ఆదికేశవ”. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా కన్పించినబోతున్న ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించారు.

పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా “ఆదికేశవ”మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకు “ఆదికేశవ” స్పెషల్ షోలు వేశారట మేకర్స్. దీంతో “ఆదికేశవ” మూవీ ఎలా ఉందన్న టాక్ బయటకు వచ్చేసింది. ఫిల్మీఫై రీడర్స్ కోసం “ఆదికేశవ” ఫస్ట్ రివ్యూ ఎక్సక్లూసివ్ గా…

“ఆదికేశవ” మూవీ ఫస్ట్ రివ్యూ టాక్ ఏంటంటే… ఈ మూవీ కొంతమంది మాస్ ఆడియన్స్ కి నచ్చే అవకాశం ఉందని, క్లైమాక్స్ లో చివరి 30 నిమిషాలు బాగుంటుందని అంటున్నారు. మిగిలినదంతా పరమ రొటీన్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది. మరి ఈ మెగా హీరో సినిమాను మెగా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో? అసలు ఈ సినిమాపై మెగా అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనబడడం లేదు.

- Advertisement -

“ఆదికేశవ” మూవీ నవంబర్ 24న అంటే రేపే రిలీజ్ కానుంది. కానీ అందరు మెగా హీరోల మూవీలకు ఉండే సందడి ఈ మూవీకి కన్పించడం లేదు. మరి రేపు థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాను ప్రేక్షకుల నుంచి వచ్చే ఫైనల్ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

“ఆదికేశవ” నిర్మాతలైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నవంబర్ 23న సినిమాకి సంబంధించి పెయిడ్ ప్రీమియర్‌లను ప్రకటించి, మూవీ హిట్ అవుతుందని తమకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే యూఎస్ లో పడాల్సిన ప్రీమియర్ షోలను క్యాన్సిల్ చేశారట. నవంబర్ 24 నుండి “ఆదికేశవ” రెగ్యులర్ షోలను వేయబోతున్నారు.

ఇక సినిమాను ఇప్పటికే పలుమార్లు పోస్టుపోన్ చేశారన్న విషయం తెలిసిందే. ముందుగా ఆగస్ట్ 18న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత ‘ఆదికేశవ’ మూవీని రిలీజ్ డేట్ ను నవంబర్ 10కి మార్చారు. ఎట్టకేలకు ఈ మూవీ నవంబర్ 24 రాబోతోంది. ‘ఆదికేశవ’ మాస్ ఫీస్ట్‌లో ఒకటంటూ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఫైనల్ రిజల్ట్ కోసం రేపటిదాకా వెయిట్ చేయక తప్పదు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు